కృష్ణ

అభివృద్ధి పేరుతో ఆలయాల కూల్చివేత గర్హనీయం:బిజెపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), జూలై 3: అభివృద్ధి పేరుతో ఆలయాలను కూల్చివేయడం గర్హనీయమని పలువురు బిజెపి నాయకులు పేర్కొన్నారు. ఆలయాల కూల్చివేతకు నిరసనగా ఆదివారం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
పార్టీ పట్టణాధ్యక్షులు తోట రంగనాథరావు అధ్యక్షతన జరిగిన సమావేశం లో ఆలయాల కూల్చివేతను తీవ్రంగా ఖండించారు. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుగా ఉన్నాయనే నెపంతో ఆలయాలను కూల్చివేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఈ చర్యలను బిజెపి తీవ్రంగా ఖండిస్తోందన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యమించేందుకు బిజెపి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సమావేశంలో బిజెపి నాయకులు పంతం వెంకట గజేంద్రరావు, ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, నూకల శేషయ్య నాయుడు, దాసు ముసలయ్య, మత్తి వెంకటేశ్వరరావు, నల్లారి మురళీకృష్ణ, కూనపరెడ్డి సుబ్బయ్య నాయుడు, ఎన్ రాము, షేక్ అమృద్దీన్, గంటా సతీష్, తదితరులు పాల్గొన్నారు.