కృష్ణ

ఘనవ్యర్థాల నిర్వహణ కేంద్రం స్థలం మెరక పనులకు శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, జూలై 3: తోట్లవల్లూరులో ఘనవ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రం నిర్మాణానికి స్థలం మెరక పనులను ఆదివారం చేపట్టారు. తోట్లవల్లూరును దత్తత తీసుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి రాజమోహన్ సహాయంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మెరక పనులు చేపట్టారు. ఘనవ్యర్థ పదార్థాల కేంద్రం నిర్మాణానికి రూ.16 లక్షలు మంజూరయ్యాయి. స్థలం గొయ్యిగా ఉండటంతో ఆరు నెలల నుంచి పనులు నిలిచిపోయాయి. గత నెలలో బెంగుళూరు నుంచి తోట్లవల్లూరు వచ్చిన రాజమోహన్‌కు పంచాయతీ కార్యదర్శి డి రాణి స్థలం సమస్యను తెలియజేశారు. స్థలాన్ని మెరక చేసేందుకు నిధులు లేక నిర్మాణ పనులు నిలిచిపోయాయని తెలియజేయటంతో రాజమోహన్ స్పందించి మెరక చేసేందుకు ఖర్చులను భరిస్తానని హామీ ఇచ్చారు. దీంతో స్థలం మెరకకు ఇసుక తోలకం పనులు ప్రారంభించారు.