కృష్ణ

సాగునీటిపై సిఎం ప్రకటనతో రైతుల్లో చిగురించిన ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, జూలై 3: గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా పోలవరం కుడి కాలువ గుండా ప్రకాశం బ్యారేజీకి తరలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వటంతో మొవ్వ మండల రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ వరి సాగుపై రైతన్నల్లో ఏర్పడిన అపోహలకు సిఎం హామీ ముగింపు పలికినట్లైంది. ముఖ్యమంత్రి వాగ్దానం కన్నా ముందుగానే వరుణ దేవుడు ఈ ఏడాది మే నెలలో 171.6 మి.మీ.ల వర్షాన్ని, జూన్‌లో 306 మి.మీ.ల వర్షాన్ని కురిపించటంతో విద్యుత్ పంపుసెట్లు, డీజిల్ ఇంజన్లతో మొవ్వ మండలంలోని దాదాపు 100 ఎకరాల్లోని రైతులు భూగర్భ జలాలతో నారుమడులు పోశారు. గత నెల 1 నుండి నారుమడులు పోయటం ప్రారంభం కావటంతో ముందుగా పోసిన నారుమడులకు వర్షం తోడు కావటంతో ఏపుగా పెరిగాయి. సోమవారం అమావాస్య తరువాత 6 నుండి మొవ్వ మండలంలో వరినాట్లు ప్రారంభించేందుకు రైతన్నలు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే బందరు కాలువ ద్వారా మేడూరు ఛానల్‌లో వర్షం నీరు విస్తారంగా ప్రవహిస్తుండటంతో పలువురు రైతులకు నారుమడుల పెంపుపై ఆశలు చిగురించాయి. ఏదిఏమైనా ముఖ్యమంత్రి ప్రకటనతో కౌలు రైతుల్లో ఆశలు చిగురించాయి.