కృష్ణ

గ్రామీణ వికాసమే భారత్ వికాస్ పరిషత్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడ్లవల్లేరు, జూలై 3: గ్రామాల వికాసం కోసం భారత్ వికాస్ పరిషత్ (బివిపి) కృషి చేస్తోందని జాతీయ అదనపు కార్యదర్శి సురేష్ జైన్ అన్నారు. మండల పరిధిలోని శింగలూరు గ్రామంలో ఆదివారం జాతీయ భారత్ వికాస్ పరిషత్ డైరెక్టర్ శాస్ర్తీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు చోడవరపు విజయకుమార్, ప్రాంతీయ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం పర్యటించారు. ఈసందర్భంగా సురేష్ జైన్ మాట్లాడుతూ భారత్ వికాస్ పరిషత్ 1963 నుంచి తమ సేవలను ప్రారంభించిందన్నారు. అందరూ కలసికట్టుగా పనిచేస్తే గ్రామం అభివృద్ధి చెందుతుందన్నారు. గ్రామాల్లో గుట్కా, మద్యపాన నిషేధం ఇతర గ్రామాలకు ఆదర్శమన్నారు. ఆధ్యాత్మిక చింతన, విద్యా, వైద్యంతో గ్రామం అభివృద్ధి చెందుతుందన్నారు. గ్రామాన్ని నేషనల్ డైరెక్టర్ విజయకుమార్ దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. గ్రామానికి వికాస్ యోజన పథకం కింద అవసరమైన వౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు.
అనంతరం భారత్ వికాస్ పరిషత్ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బండారు శ్యాంకుమార్, కార్యదర్శిగా నాగమల్లేశ్వరరావు, కోశాధికారిగా కె హనుమంతును నియమించి విజయకుమార్ ప్రతిజ్ఞ చేయించారు. తొలుత స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపిడివో ఆర్ కేశవరెడ్డి, అడుసుమిల్లి రామ్మోహనరావు, నందం చిట్టిబాబు, నందం శ్రీనివాసరావు, ఆకురాతి శ్రీను పాల్గొన్నారు.