కృష్ణ

జగ్గయ్యపేటలో భారీ కార్డన్ సెర్చ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట, జూలై 3: పట్టణంలోని ధనంబోడు కాలనీలో ఆదివారం రాత్రి నందిగామ డిఎస్‌పి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్ల సిఐలు, డివిజన్‌లోని 12మంది ఎస్‌ఐలతో నిర్వహించిన ఈ కార్డన్ సెర్చ్ ధనంబోడు కాలనీలోని సుమారు 500 ఇళ్లలో పోలీసులు అణువణువునా తనిఖీలు నిర్వహించారు. స్వయంగా డిఎస్‌పి ఉమామహేశ్వరరావు పలు ఇళ్లలోకి వెళ్లి ఎవరెవరు నివసిస్తున్నారు, పరిసరాల్లో ఎవరెవరు నివసిస్తున్నారు, తదితర అంశాలను ప్రశ్నించారు. వాహనాలను వాటి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో 500కు పైగా నివాసాలు ఉన్నాయని, వీటిలో చాలా వరకు ఖాళీగా ఉండటం, లేదా యజమానులు వేరే వారికి అద్దెలకు ఇవ్వడంతో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారం ఉందన్నారు. ఇళ్లను అద్దెకు ఇచ్చే వారు వారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకొని అద్దెకు ఇవ్వాలన్నారు. ఇళ్లలో నివసించే వారు కూడా తమ చుట్టు పక్కల ఎవరు ఉంటున్నారు, ఏమి జరుగుతుందని గమనించాలని, ఏ మాత్రం అనుమానం ఉన్నా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ కాలనీపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ కార్డన్ సెర్చ్‌లో 20 మంది హెచ్‌సిలు, డివిజన్‌కు సంబంధించిన 200 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఒక్కసారిగా ఇంత మంది పోలీసు అధికారులు, సిబ్బంది వాహనాల్లో వచ్చి ఇంటింటి తనిఖీ చేస్తుండటంతో కాలనీవాసులు ఆందోళనకు గురయ్యారు. తనిఖీలు రాత్రి పొద్దుపోయే వరకూ కొనసాగుతున్నాయి.