కృష్ణ

కూరగాయల మార్కెట్‌లో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువూరు, జూలై 4: స్థానిక సర్దార్‌పేట బాపయ్య కూరగాయల మార్కెట్‌లో దుకాణాల వేలం విషయంలో వివాదంతో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. వేలం అక్రమమని కొందరు దుకాణాదారులు, నిబంధనల ప్రకారమే వేలం నిర్వహించామని పంచాయతీ సిబ్బంది చెప్పగా వారికి మరికొందరు దుకాణదారులు వత్తాసు పలకడంతో వివాదం నెలకొంది. మార్కెట్‌లోని 37 దుకాణాలకు ఈ నెల 1న బహిరంగ వేలం నిర్వహించగా 14 దుకాణాలు పాడుకున్నారని, మిగతా దుకాణాల వేలం వాయిదా పడినట్లు సీనియర్ అసిస్టెంట్ కామేశ్వరరావు తెలిపారు. 21వ నంబరు షాపుతో వివాదం నెలకొందన్నారు. పాడుకోని షాపులకు ఈ నెల 2న తాళాలు వేయించగా కొందరు పగలగొట్టారని, పాటలో పాల్గొన్నవారికి వారి అనుమతితో దుకాణాలు అప్పగించేందుకు వచ్చినట్లు సీనియర్ అసిస్టెంట్ తెలిపారు. కాగా గత నెల 29 రాత్రి నోటీసు ఇచ్చి 1వ తేదీ అర్ధంతరంగా వేలం జరిపారని, మూడు దశాబ్దాలుగా మార్కెట్‌లో ఉంటున్న తనకు దీనివల్ల అన్యాయం జరిగిందని 21వ షాపు యజమాని తాటిశెట్టి పూర్ణచంద్రరావు తెలిపారు. పైగా తాను కోర్టును ఆశ్రయించానని, 2017 వరకు తనకు అనుమతి ఉందని, అయినా దౌర్జన్యంగా దుకాణం ఖాళీ చేయించేందుకు పంచాయతీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. 1వ తేదీతో ఉన్న దుకాణాల స్వాధీన లేఖపై ఈ రోజు సంతకాలు చేయించుకోవడమేమిటని ఆయన ప్రశ్నించారు. పూర్ణచంద్రరావుకు మద్దతుగా మరికొందరు దుకాణాదారులు నిలిచారు. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. విఆర్‌ఓలు తిరుపతిరావు, శ్రీనివాసరావు ద్వారా పంచనామా జరిపి నిబంధనల ప్రకారం ఖాళీ చేయని షాపులను స్వాధీనం చేసుకుంటామని సీనియర్ అసిస్టెంట్ వివరించారు.