కృష్ణ

అవినీతికి కేరాఫ్ అడ్రస్ మోదీ, చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూలై 4: అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోది, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన అంతా అవినీతి పంథాలో సాగుతోందన్నారు. స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మోడీ, చంద్రబాబు నిరంకుశ పాలనపై ధ్వజమెత్తారు. కాసులకు కక్కుర్తి పడి అభివృద్ధిని కాలరాస్తున్నారన్నారు. విదేశీ పర్యటనలతో కాలక్షేపం, అరచేతిలో వైకుంఠం చూపిస్తూ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్డీఎ, తెలుగుదేశం రెండేళ్ళ పాలనలో దేశానికి, రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. వీరి అవినీతిని చూసి విదేశీ కంపెనీలు సైతం పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రధాని మోడీ పారిశ్రామిక వేత్తలకు కోట్లాది రూపాయలు లాభం చేకూర్చి వాళ్ళ వద్ద నుండి వసూళ్ళు చేసిన డబ్బును ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో మంచినీటి ప్రాయంగా ఖర్చు చేశారని ఆరోపించారు. పంచవర్ష ప్రణాళికలతో కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి దశ, దిశ చూపిస్తే మోది మాయ మాటలతో మొండి చెయ్యి చూపిస్తున్నారని విరుచుకుపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి దేశాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎనలేని కృషి చేసిందన్నారు. ఆ కృషి ఫలితంగానే నేడు దేశంలో 7.5శాతం వృద్ధి సాధించిందన్నారు. ఇది నా ఒక్కడి గొప్ప అని మోది చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని జపం తప్ప మరొకటి చేయడం లేదన్నారు. గత చంద్రబాబు పాలనలో కన్నా ప్రస్తుతం అవినీతి పెచ్చుమీరిపోయిందన్నారు. తండ్రీ కొడుకుల అవినీతి కారణంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. కాపుల ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు నేడు ఆ వర్గాన్ని పూర్తిగా అణగతొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మైనార్టీల్లో కూడా చంద్రబాబు పాలన పట్ల అభద్రతా భావం నెలకొందన్నారు. 10శాతం జనాభా కలిగిన మైనార్టీలకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఐదు శాతం కూడా జనాభా లేని ఒక సామాజిక వర్గానికి 30శాతం పదవులు అప్పగించి కుల నాయకుడిగా చంద్రబాబు ముద్ర వేసుకున్నారని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చే పరిస్థితులు తొందరలోనే ఉన్నాయన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిని ప్రోత్సహించకుండా ప్రజాహితం కోసం పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల రామకృష్ణ, డా. రాధికా మాధవి, అబ్దుల్ మతీన్, బుల్లెట్ ధర్మారావు, మత్తి వెంకటేశ్వరరావు, ఎస్‌వి రాజు, మొవ్వ మోహనరావు, కోన నాగరాజు, దారపు శ్రీరామ్, బాడిత పద్మ, జన్యావుల లక్ష్మయ్య పాల్గొన్నారు.