కృష్ణ

ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూలై 4: స్థానిక 30వ వార్డు దళితవాడలో ఆ ప్రాంత మహిళల అవసరార్ధం ప్రభుత్వం నిర్మించిన మరుగుదొడ్లను కూల్చి వేసి ఆక్రమణకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దళిత బహుజన పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా పరిరక్షణ సంఘం నాయకులు అన్నవరపు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆర్‌ఎస్ నెం. 264లోని ఎనిమిది సెంట్ల ప్రభుత్వ భూమిలో గతంలో దళిత మహిళల అవసరార్ధం మరుగుదొడ్లు నిర్మించారన్నారు. ఇటీవల కాలంలో ఆ వార్డు మాజీ కౌన్సిలర్, తెలుగుదేశం పార్టీ నాయకుడు బోలెం హరిబాబు మరుగుదొడ్లను కూల్చి వేసి సదరు స్థలాన్ని ఆక్రమించాడని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి చెరుకూరి రంగయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన పరిరక్షణ సంఘం నాయకులు నీలం పుల్లయ్య, ఎగ్గోని గాంధి, బేతపూడి రవి, సిహెచ్ నాగరాజు, చిట్టూరి గురునాధం, బూరగ రామారావు పాల్గొన్నారు.