కృష్ణ

కలెక్టర్ వస్తేనే మీరూ వస్తారా...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూలై 4: కలెక్టర్ వస్తేనే మేమూ వస్తాము అనే ధోరణిని జిల్లా అధికారులు విడనాడాలని జిల్లా రెవెన్యూ అధికారి చెరుకూరి రంగయ్య అన్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ‘మీకోసం’కు జూనియర్ అసిస్టెంట్స్ వస్తే సమస్యలు పరిష్కారం కావని, జిల్లా అధికారులంతా విధిగా హాజరు కావాలన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ‘మీకోసం’లో పాల్గొన్న ఆయన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఓ మాట్లాడుతూ చాలా మంది జిల్లా అధికారులు కలెక్టర్ వచ్చిన రోజునే వస్తున్నారని, మిగిలిన రోజుల్లో జూనియర్ అసిస్టెంట్స్‌ను పంపించి చేతులు దులుపుకుంటున్నారన్నారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఒక వేళ రాలేని పరిస్థితులు ఉంటే విధిగా కలెక్టర్ అనుమతి తీసుకోవాలన్నారు. లేకుండా కలెక్టర్ తీసుకునే చర్యలకు కట్టుబడి ఉండాల్సి ఉంటుందన్నారు. గైర్హాజరైన జిల్లా అధికారుల వివరాలను కలెక్టర్ దృష్టిలో పెట్టడం జరుగుతుందన్నారు. కాగా సోమవారం జరిగిన ‘మీకోసం’ సమావేశానికి జిల్లా అధికారులంతా డుమ్మా కొట్టారు. ముగ్గురు నలుగురు మినహా మిగిలిన శాఖల నుండి కార్యాలయ ఉద్యోగులు పాల్గొనడం విశేషం.