కృష్ణ

పోలవరం కాలువ పనులు పూర్తి చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, జూలై 4: పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రంగం సిద్ధణ చేస్తున్నారని, బుధవారం నీరు విడుదల చేస్తారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పనులు వేగవంతం చేయాలని అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం మండలంలోని సీతారామపురంలో జరుగుతున్న పనులను మంత్రి పరిశీలించారు. రామిలేరు, తమ్మిలేరుపై జరుగుతున్న పనులను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 6వ తేదీ ముహూర్తం ఖరారు చేశారని చెప్పారు. కాలువ పనులు దాదాపుగా పూర్తి అయ్యాయని, నూజివీడు ప్రాంతంలోనే పలు ఇంకా చివరి దశకు రాలేదని చెప్పారు. ఎందుకు పనులు వేగవంతంగా జరగటం లేదని జనవనరుల శాఖ అధికారులు, గుత్తేదారుడ్ని ప్రశ్నించారు. మంగళవారం సాయంత్రానికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. రాత్రి పూట కూడా పనులు చేయాలని, ముఖ్యమంత్రి కూడా పూర్తి అయిన పనులు పరిశీలించే అవకాశం ఉందని చెప్పారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణా జిల్లాకు అందించే కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని పనులు పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఇఎన్‌సి ఎం వెంకటేశ్వరరావు తో పాటు పలువురు సాగర్ అధికారులు, జల వనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు.