కృష్ణ

బందరు ఓడరేవు..నవ్యాంధ్ర అభివృద్ధికి తొలిమెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూలై 24: బందరు ఓడరేవు నిర్మాణం నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి తొలిమెట్టు కానుందని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈప్రాంత ప్రజల చిరకాల వాంఛతో పాటు రాష్ట్ర విభజన అనంతరం బందరు పోర్టు, పరిశ్రమల స్థాపనకు ఆవశ్యకత ఏర్పడిందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో పోర్టు నిర్మాణానికి కృషి చేస్తున్నారన్నారు. పోర్టుతో పాటు పరిశ్రమల స్థాపనకు 36వేల ఎకరాల భూమి అవసరం ఏర్పడిందన్నారు. ఏ ఒక్క రైతుకీ అన్యాయం జరగకుండా భూములు సేకరించేందుకు ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అవలంబిస్తున్నామని చెప్పారు. రాజధాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌కు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 36వేల ఎకరాల భూములను ఇచ్చారన్నారు. అదేవిధంగా బందరులో కూడా ఓడరేవు నిర్మాణానికి 14వేల ఎకరాల పట్టా భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరిస్తామన్నారు. 14వేల ఎకరాలు ప్రభుత్వ భూమి, 8వేల ఎకరాలు అసైన్డ్ భూమి అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. సిఆర్‌డిఏ తరహా ప్యాకేజీనే ఇక్కడి రైతులకు కూడా అమలు చేస్తామన్నారు. అసైన్డ్, ప్రభుత్వ భూముల్లో ఉన్న రైతులకు కూడా మేలైన ప్యాకేజీని ప్రకటించామన్నారు. తెలుగు రాష్ట్రాలకు అతి చేరువలో ఉన్న బందరు పోర్టు ద్వారా పెద్దఎత్తున ఎగుమతులు, దిగుమతులు జరిగే అవకాశం ఉందన్నారు. పారిశ్రామికంగా, రవాణా రంగంలో ఈప్రాంతం గణనీయమైన అభివృద్ధి సాధించనుందని చెప్పారు. భూములిచ్చిన రైతులకు మెగా టౌన్‌షిప్‌ను నిర్మించి లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు కేటాయిస్తామన్నారు. ఏ ఒక్క రైతుకీ అన్యాయం జరగకుండా ప్యాకేజీని ప్రభుత్వం జీవో నెం. 185 ద్వారా ప్రకటించిందన్నారు. ఈ ప్యాకేజీ పట్ల రైతుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. కొన్ని రాజకీయ శక్తులు రైతుల్లో లేనిపోని అపోహలు సృష్టించి ఈప్రాంత అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. వారికి రైతులే తగిన రీతిలో బుద్ధి చెబుతారని మంత్రి రవీంద్ర హెచ్చరించారు. పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ స్వాతంత్య్రానికి పూర్వం అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతి గాంచిన బందరు పోర్టు దురదృష్టవశాత్తూ గత పాలకుల వైఫల్యం కారణంగా మరుగున పడిందన్నారు. బందరు పోర్టు విశిష్ఠతను గుర్తించిన తమ ప్రభుత్వం ఓడరేవు నిర్మాణానికి చర్యలు తీసుకుందన్నారు. సోమవారం పోర్టు భూముల సేకరణకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందన్నారు. మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (మడ) కార్యాలయాన్ని కూడా త్వరలోనే ప్రారంభించి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు కొనసాగిస్తామన్నారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు పి సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ జగన్నాథరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాథం పాల్గొన్నారు.