కృష్ణ

పల్లెర్లమూడిలో మంత్రి ఉమ మకాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, ఆగస్టు 4: రాష్ట్ర మంత్రి మండలిలో అత్యధిక ప్రాధాన్యత కలిగిన మంత్రి, రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల ద్వారా జలాలు గలగలా పారించి, లక్షలాది ఎకరాల వ్యవసాయ క్షేత్రాల్లో సిరులు పండిస్తూ, దేశంలోనే ప్రప్రథమంగా నదులను అనుసంధానం చేసిన ఘనత పొందిన జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నాలుగు రోజులుగా నూజివీడులో తిష్టవేసి అధికారులను, గుత్తేదారులను పరుగులు పెట్టిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాత్రివేళ సైతం ఇక్కడే మకాం వేసి, మడత మంచంపైనే నిద్రిస్తూ, అన్ని కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పనులు పర్యవేక్షిస్తున్నారు. జలవనరుల శాఖ పేషీ నూజివీడు వచ్చిందా?.. అనే రీతిలో మంత్రి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కృష్ణా-గోదావరి నదుల అనుసంధానానికి భూమిక పోషించిన పోలవరం కాలువకు నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామ సమీపంలోని 122 కిమీ వద్ద సోమవారం తెల్లవారుజామున గండి పడింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హుటాహూటీన సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. జరిగిన సంఘటనపై పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించి, గండి పూడ్చి వేత పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. తను వెళ్ళిపోతే పనులు నత్తనడకన సాగతాయని భావించిన మంత్రి దేవినేని ఉమ గండి పడిన ప్రాంతంలోనే మకాం వేశారు. పనులు పూర్తి చేసి, నీరు వదలిన తరువాతే వెళతానని మంత్రి ఉమ స్పష్టం చేసి, రాత్రి వేళ నిద్రించేందుకు సైతం అవసరమైన సరంజామాను ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పటి కప్పుడు పనులను పరిశీలించుకుంటూ, అధికారులకు, గుత్తేదారులకు పలు సూచనలు ఇస్తున్నారు. గత నాలుగు రోజుల నుండి వర్షం పడుతున్నప్పటకీ ఏమాత్రం పట్టు విడువకుండా, గండి పనులు పూడ్చి వేయటమే ప్రధాన లక్ష్యంగా పనులు చేయిస్తున్నారు. జల వనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం వెంకటేశ్వరావు, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌తో పాటు పోలవరం కాలువకు చెందిన పలువురు అధికారుల పర్యవేక్షణలో పనులు వేగంగా జరుగుతున్నాయి. నూజివీడు నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నేతలతో సమాలోచనలు చేశారు. నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కాపా శ్రీనివాసరావు బుధవారం మంత్రి దేవినేని ఉమతో సమావేశం అయ్యారు. నియోజకవర్గం సమస్యలు, అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. అదే విధంగా ఎపెక్సు కమిటీ సభ్యులు ఆళ్ళ గోపాలకృష్ణ, జిల్లా తెలుగురైతు అధ్యక్షులు చలసాని ఆంజనేయులు తదితర నాయకులు మంత్రి దేవినేని ఉమ వెంట ఉంటూ పనులు సమీక్షిస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి పనులు పూర్తి అయ్యే అవకాశం ఉందని జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.