కృష్ణ

విద్యాభివృద్ధికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైకలూరు, ఆగస్టు 4: రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తుందని, విద్య, వైద్యం రెండూ సమాజానికి కళ్లులాంటివని రాష్ట్ర వైద్య ఆరోగ్య, వైద్య విద్య శాఖ మంత్రి డా.కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కైకలూరు జూనియర్ కళాశాలలో రూ.65 లక్షలతో నాబార్డు నిధులతో నిర్మించిన అదనపు గదులను మంత్రి డా.కామినేని శ్రీనివాస్, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కామినేని మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి రూ.21 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. గత ప్రభుత్వాలు విద్యాభివృద్ధికి బడ్జెట్‌లో 10 శాతం కేటాయిస్తే ప్రస్తుత ప్రభుత్వం 17.5 శాతం ఖర్చు చేసిందన్నారు. డిఎస్సీ ఉత్తీర్ణులైన ఉపాధ్యాయులను రూ.40 వేల నుంచి రూ.90 వేల వరకు జీతాలు ఇచ్చి, విద్యార్థులకు అవసరమైన వౌలిక సదుపాయాలు కల్పించి పాఠశాలలు నిర్మిస్తున్నా, బీదవారు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారన్నారు. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏ దేశమైనా సంపన్న దేశంగా గుర్తించాలంటే ఖనిజాలు, బంగారం నిల్వలు, పరిశ్రమలు ద్వారా కాదని, యువశక్తి, ప్రతిభావంతమైన, చురుకైన యువత ఎక్కడైతే ఉంటుందో అదే సంపన్న దేశం అని మాజీ రాష్టప్రతి అబ్దుల్‌కలామ్ అన్నారని గంటా ఈ సందర్భంగా గుర్తు చేశారు. మనదేశంలోనే యువశక్తి ఉందని, అందువల్లే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పలు ప్రసంగాల్లో ఇక ప్రపంచాన్ని శాసించేది భారతదేశమే అని అనేక పర్యాయాలు ఉద్ఘాటించారన్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరికి కృషి లక్ష్యం ఉండాలని, అందుకే జాతిపిత మహాత్మాగాంధీ ‘కృషి నీకు ఆయుధం అయితే.. లక్ష్యం మీకు బానిస’ అవుతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి సభ దృష్టికి తెచ్చారు.