కృష్ణ

హోటళ్లలో గదుల కేటాయంపుపై శ్రద్ధ వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 4: కృష్ణా పుష్కరాల సందర్భంగా హోటళల్లో రూములు కేటాయింపు విషయంలో ప్రత్యేక అధికారి దిశానిర్దేశం మేరకు కేటాయింపులు జరపాలని అందుకు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని హోటల్ యజమానులకు సబ్ కలెక్టర్ జి సృజన తెలిపారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం నగరంలోని 105 హోటళ్ల ప్రతినిధులతో ఆమె, ట్రైనీ కలెక్టర్ డికె బాలాజీతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ 12 నుండి 23వ తేదీ వరకు కృష్ణా పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన్నట్లు ఆమె పేర్కొన్నారు. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు మూడున్నర కోట్ల మంది భక్తులు రావచ్చనే అంచనా ఉందన్నారు. ఈ సందర్భంలో సామాన్య ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి అధికారులు, న్యాయాధికారులు, దేశ విదేశాల ప్రముఖులు, పర్యాటకులు రావడం జరుగుతుందన్నారు. కృష్ణా పుష్కరాల ఆతిథ్య సేవలు హోటళ్ల ప్రాముఖ్యత, బస అత్యధిక ప్రాధాన్యత గల అంశంగా ఆమె తెలిపారు. ఈ దిశలో యాజమాన్యాలు జిల్లా యంత్రాంగానికి పూర్తిస్థాయిలో సహకరించాల్సి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారని ఆమె తెలిపారు. హోటళ్ల యాజమాన్యాల ప్రతినిధులు, సిబ్బంది, హాస్పటాలటి విధానంలో అతిథులకు ఆహ్వానాలు పలకాలని ఆయా హోటళ్లలో నిర్ణయించిన రూం ధరలను ప్రదర్శించాలని తెలిపారు. హోటళ్లలో కేటాయించే రూములలో 20 శాతం రూములు ప్రముఖులు, అత్యున్నత అధికారులకు తప్పనిసరిగా కేటాయింపులు జరపాల్సి ఉంటుందని, మిగిలిన రూముల కేటాయింపులో కూడా జిల్లా యంత్రాంగానికి సహకరించాలని ఆమె తెలిపారు. సంబంధిత రూముల కేటాయింపుల వివరాలను ఎప్పటికప్పుడు సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూములకు తెలియపరచాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో గేట్‌వే, మురళీఫార్చ్యున్, డివి మేనర్, ఐలాపురం తదితర 90కి పైగా హోటళ్ల ప్రతినిధులు హాజరయ్యారు.