కృష్ణ

రెండు దశాబ్దాల తరువాత సొంత గూటికి నెహ్రూ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, ఆగస్టు 28: రెండు దశాబ్దాల క్రితం టిడిపిని వీడిన మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ స్వంత గూటికి చేరుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో 5సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఘనత నెహ్రూకే దక్కింది. 1995 టిడిపి నుండి బైటకొచ్చిన నెహ్రూ తదనంతరం రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణాల నేపథ్యంలో ఆయన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ప్రోద్బలంతో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కొద్ది రోజులుగా నెహ్రూ కాంగ్రెస్ పార్టీ వీడుతున్నట్లు వార్తలు వెలువడటంతో వాటికి పుల్‌స్టాప్ పెట్టటానికి నెహ్రూ ఆదివారం సాయంత్రం గుణదలలోని ఆయన నివాస గృహంలో నెహ్రూ, అనినాష్ తమ ముఖ్య అనుచరులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నెహ్రూ కార్యకర్తలతో మాట్లాడుతూ తాను తెలుగుదేశం పార్టీలో ఓనమాలు నేర్చుకుంటే, అవినాష్ మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఓనమాలు నేర్చుకున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ తనకు తండ్రిలాంటి పార్టీ అయితే, తనకు, అవినాష్‌కు కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటిందని ఆయన అభివర్ణించారు. తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ తమ కుటుంబానికి తక్కువ ఏమీ చేయలేదన్నారు. తనకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యడునిగా చేస్తే, అవినాష్‌ను రాష్ట్ర యూత్ అధ్యక్షుడిగా చేసిందన్నారు. అయినా ఎంత కష్టపడినా కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్ లేదని, అందువలనే కార్యకర్తలు అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నానని చెప్పారు. తాను ఏ నిర్ణయం తీసుకున్న కార్యకర్తల కోసమేనన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు కార్యకర్తలే తన ఊపిరని తెలిపారు. వైఎస్సార్ పార్టీ నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతుందని పరోక్షంగా తెలిపారు. వైఎస్సార్ పార్టీలో బెర్తులు ఖాళీగా ఉన్నాయని, తెలుగుదేశం పార్టీలో బెర్తులు పుల్ అయినప్పటికీ, కార్యకర్తలు మనోభావాల మేరకు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందన్నారు. అనంతరం పెద్ద ఎత్తున సమావేశానికి తరలివచ్చిన ముఖ్య అనుచరులు, అభిమానులు, కార్యకర్తల అభిప్రాయాలను నెహ్రూ కోరగా మీరు ఏ నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయం మేరకు కట్టుబడి ఉంటామని తెలిపారు. ఒక వారం, పది రోజుల్లో భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, ముఖ్య అనుచరులతో తెలుగుదేశం పార్టీలో చేరటానికి నెహ్రూ ముహుర్తం ఖరారు చేసుకుంటున్నట్లు సంకేతాలు ఇచ్చారు. పెద్ద ఎత్తున ముఖ్య అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున గుణదల నెహ్రూ నివాసానికి తరలిరావటంతో గుణదల ఏలూరు రోడ్డుకి ఇరువైపుల భారీగా కార్లు, ద్విచక్రవాహనాలతో నిండిపోయింది. భారీగా కార్యకర్తలు తరలిరావటంతో గుణదల ప్రాంతం కోలాహలంగా మారింది. ఈ కార్యక్రమంలో నెహ్రూ ముఖ్య అనుచరులు బుచ్చిబాబు, అనే్న చిట్టిబాబు, మాజీ డెప్యూటీ మేయర్ ఆళ్లా చెల్లారావు, మాజీ కార్పొరేటర్లు, మాజీ జడ్‌పిటిసి సభ్యులు, మాజీ ఎంపిటిసి సభ్యులు, మాజీ సర్పంచ్‌లు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.