కృష్ణ

విద్యుత్ వినియోగదారులకు రూ.4 లక్షల విలువ చేసే ఫ్యాన్‌లు పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), సెప్టెంబర్ 19: బందరు మండలంలో విద్యుత్ వినియోగదారులకు రూ.4లక్షల విలువచేసే ఫ్యాన్లు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర బిసి సంక్షేమం చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. సోమవారం వాటర్ వర్క్స్ ఆవరణలో ఏర్పాటైన సమావేశంలో సదరన్ పవర్ డిస్టిబ్యూషన్, ఇఇఎస్‌ఎల్ సంయుక్తంగా పవర్ పథకం కింద కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ సౌజన్యంతో విద్యుత్ ఆదా చేసే బిఎస్ 5స్టార్ సీలింగ్ ఫ్యాన్‌లను మంత్రి రవీంద్ర వినియోగదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌ఇడి బల్బులు పంపిణీ చేయగా, ప్రస్తుతం సీలింగ్ ఫ్యాన్‌లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కొక్క వినియోగదారునికి రెండు ఫ్యాన్‌లు, వ్యాపార సంస్థలకు పది ఫ్యాన్‌లు, పరిశ్రమలకు కావాల్సినన్ని ఫ్యాన్‌లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వీటి వల్ల 30శాతం విద్యుత్ ఆదా అవుతుందన్నారు. ఫ్యాన్‌ల మార్కెట్ ధర రూ.2వేలు కాగా ఒక్కొక్క ఫ్యాన్ రూ.1100లకే పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఒకేసారి కొనలేని వినియోగదారులు నెలసరివాయిదాలలో వారి విద్యుత్ బిల్లులలో మినహాయించే సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన విద్యుత్ సంస్కరణల వల్ల 24 గంటల విద్యుత్ సాధ్యమైందన్నారు. ఫ్యాన్‌లు అందరికీ చేరే విధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.