కృష్ణ

పంట కాలువలో గల్లంతైన విద్యార్థుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, సెప్టెంబర్ 21: అవనిగడ్డ పంట కాలువలో బుధవారం రాత్రి ఈతకు దిగిన ఇద్దరు విద్యార్థులు గల్లంతు కాగా, వారి మృతదేహాలు గురువారం ఉదయం లభ్యమయ్యాయి. స్థానిక 9వ వార్డులోని సెవెన్త్‌డే ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు పుల్లా చంద్(14), కసిరి పాండు(14), కులశేఖర్, విశ్వనాథపల్లి రాజేష్, బి విక్కీ బుధవారం మధ్యా హ్నం పరీక్షలు రాశారు. సాయంత్రం వార్డెన్‌కు చెప్పకుండా బయటకు వెళ్ళిన ఈ విద్యార్థులు లంకమ్మ మాన్యం సమీపాన అశ్వరావుపాలెం రహదారిపై ఉన్న వంతెన వద్ద ఆడుకుంటుండగా ముసునూరు మండలం గోపవరానికి చెందిన చందు, నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన పాండు సరదాగా పంట కాలువలోకి ఈతకు దిగారు. నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో మునిగిపోయి గల్లంతయ్యారు. ఆ సమయంలో వర్షం పడుతుండటం, చీకటి పడిపోవటంతో గాలింపు చర్యలకు కొంత అంతరాయం ఏర్పడింది. ఈనేపథ్యంలో గురువారం ఉదయం తహశీల్దార్ ఆసియా నాయక్, అగ్నిమాపక సిబ్బంది, ఎస్‌ఐ మణికుమార్, కె వెంకటేశ్వరరావు, సర్పంచ్ పృధ్వీరాజు సమక్షంలో గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. వంతెన సమీపంలోనే చందు, పాండు మృతదేహాలు లభ్యమయ్యాయి. శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారం వ్యక్తం చేశారు. మృతుల తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాలకు పంచనామా నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు.