కృష్ణ

మునే్నరుకు వరద ఉద్ధృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ/ పెనుగంచిప్రోలు/ వత్సవాయి, సెప్టెంబర్ 22: నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు భారీ వర్షం కురవడంతో లోటత్తు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు మునే్నరుకు భారీగా వరద నీరు చేరుకుంది. వత్సవాయి మండలం లింగాల వద్ద మునే్నరు కాజ్‌వేను ఆనుకుని వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మునే్నటికి భారీగా వరద రావడంతో పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయ సమీపంలో మునే్నటి ఒడ్డున గల దుకాణాల్లోకి వరద నీరు చేరుకుంది. అధికారుల సూచనలతో దుకాణాలను ఖాళీ చేశారు. బుధవారం రాత్రి నుండి మునే్నటికి వరద ఉద్ధృతి ఎక్కువవడంతో రెవెన్యూ అధికారులు అప్రమత్తం అయ్యారు. మునే్నటి పరీవాహక ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ, కంచికచర్ల ప్రాంతాల్లో వాగులు పొర్లి ప్రవహిస్తున్నాయి. పొలాల్లో వర్షపు నీరు నిలిచింది. గ్రామాల్లో గ్రావెల్ రోడ్డు బురదమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో ఇబ్బందులు పడ్డారు. పొలాల్లో నిలిచిన వర్షపు నీరు బయటకు పంపేందుకు రైతులు చర్యలు తీసుకుంటున్నారు.