కృష్ణ

నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, సెప్టెంబర్ 24: కృష్ణానదికి వరద వస్తున్నందున నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ ఆసియా నాయక్ సూచించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుండి కృష్ణానదిలోకి లక్షా 40వేల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారని, పులిగడ్డ అక్విడక్టుకు ఇప్పటికే వరద నీరు చేరిందన్నారు. కృష్ణా నదీ గర్భంలోని ఎడ్లలంక గ్రామానికి వెళ్ళిన తహశీల్దార్ అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు. మండలంలోని పులిగడ్డ, దక్షిణ చిరువోల్లంక, వేకనూరు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నదిలో సగానికి పైగా వరద నీరు చేరినందున పుష్కర ఘాట్ల వద్దకు వెళ్ళవద్దని కోరారు. ఆయనతో పాటు జెడ్పీటిసి వెంకటేశ్వరరావు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.