కృష్ణ

ప్రజల భాగస్వామ్యంతోనే దోమల నిర్మూలన సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, సెప్టెంబర్ 24: ప్రజల భాగస్వామ్యంతోనే దోమలను నిర్మూలించగలమని రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ‘వనం-మనం’ కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణ ప్రధాన పార్కులో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యం, అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో దోమల వల్ల వచ్చే వ్యాధులను అరికట్టగలమన్నారు. దోమల వల్ల వచ్చే వ్యాధులపై ప్రజలు అవగాహన పొందాలన్నారు. అప్పుడే వాటిని ఎదుర్కోగలమన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటంతో పాటు దోమల నివారణపై ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాథమిక చర్యలతోనే దోమలను పూర్తిగా అరికట్టవచ్చన్నారు. ఇళ్ళల్లోని చెత్తాచెదారాన్ని విధిగా డంపింగ్ బిన్స్‌లో మాత్రమే వేయాలన్నారు. అలాగే పరిసర ప్రాంతాల్లో మురుగునీరు నిలవకుండా చూడాలన్నారు. వీధివీధిన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఈవిషయంలో ఆరోగ్య సిబ్బంది, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు ప్రజలను చైతన్యపర్చాలని మంత్రి రవీంద్ర కోరారు. మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ మాట్లాడుతూ పట్టణంలోని 42 వార్డుల్లో విషజ్వరాలు ప్రబలకుండా ప్రజలు తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలియజేస్తూ కరపత్రాలు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సాయిబాబు, మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, 2వ వార్డు కౌన్సిలర్ మోదుమూడి శేషుబాబు, టిడిపి పట్టణ అధ్యక్షులు ఇలియాస్ పాషా, తదితరులు పాల్గొన్నారు.