కృష్ణ

శ్మశానవాటికపై మళ్లీ వివాదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక, సెప్టెంబర్ 25: స్థానిక శ్మశానవాటిక స్థలం విషయంలో నాగాయలంక, రేమాలవారిపాలెం గ్రామాల మధ్య తిరిగి వివాదం రాజుకుంది. ఈ నెల 24న రేమాలవారిపాలెం గ్రామానికి చెందిన రేమాల వెంకటరత్నం అనే మహిళ మృతదేహాన్ని నాగాయలంక పంచాయతీ పరిధిలోని తాగునీటి చెరువు దక్షిణం వైపున ఖననం చేసేందుకు ప్రయత్నించిన సంఘటన వెలుగు చూడటంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది. ఈ సమస్యపై పంచాయతీ కార్యదర్శి కె త్రిపురసుందరి, సర్పంచ్ శీలి రాము తమకు అందిన సమాచారం మేరకు శ్మశాన స్థలానికి వెళ్లి నివారించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. దీంతో రేమాలవారిపాలెం గ్రామానికి చెందిన మత్తి రాజా, మత్తి వెంకట రామయ్యలను ప్రధాన నిందితులుగా పేర్కొంటూ ఆదివారం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కార్యదర్శి, సర్పంచ్ మాట్లాడుతూ ఈ స్థల విషయమై రేమాలవారిపాలెం పంచాయతీకి ఎలాంటి సంబంధం లేదని గతంలోనే బందరు ఆర్డీఓ సాయిబాబు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు స్పష్టం చేశారన్నారు. అనంతరం వివాదం సద్దుమణగక పోవటంతో అవనిగడ్డ డిఎస్పీ సయ్యద్ ఖాదర్ బాషా నేతృత్వంలో రెండు గ్రామాలకు చెందిన ప్రజల మధ్య సయోద్య కుదిర్చారని తెలిపారు. రేమాలవారిపాలెం గ్రామస్తులు దీనికి విరుద్ధంగా వ్యవహరించటంతో తాము పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని వారు వివరించారు. ఎస్‌ఐ జి అనీల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.