కృష్ణ

ఎంపిపి ఉప ఎన్నికపై ఉత్కంఠ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెడన, సెప్టెంబర్ 25: పెడన మండల పరిషత్ అధ్యక్ష పదవికి ఈ నెల 29న జరగనున్న ఉప ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎత్తుకు పైఎత్తులతో రాజకీయాన్ని కాక పుట్టిస్తున్నాయి. ఎంపిపి పదవిని దక్కించుకునేందుకు గతంలోనే ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాల్సినంత మెజార్టీ ఉన్నప్పటికీ నాడు టిడిపి వ్యూహానికి ఆ పదవిని కాస్తా చేజార్చుకుంది. వైకాపా తరఫున నందిగామ నుండి పోటీ చేసిన జన్ను భూలక్ష్మిని చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీ వైపునకు తిప్పుకొని ఆమెకు ఎంపిపి పదవిని కట్టబెట్టారు. తర్వాత కొంతకాలానికి భూలక్ష్మిపై పార్టీ ఫిరాయింపు చట్టం కింద అనర్హత వేటు పడింది. దీంతో వైస్ ఎంపిపిగా వ్యవహరిస్తున్న ముచ్చు నాగేశ్వరమ్మ ఇన్‌ఛార్జ్ ఎంపిపిగా కొనసాగుతున్నారు. మళ్లీ అదే వ్యూహంతో అధికార తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతోంది. పెడన మండల పరిషత్ పరిధిలో మొత్తం 10 ఎంపిటిసి సెగ్మెంట్లు ఉండగా ఇందులో గతంలో అనర్హత వేటుపడి పదవి కోల్పోయిన జన్ను భూలక్ష్మి ప్రాతినిధ్యం వహించిన నందిగామ ఎంపిటిసి సెగ్మెంట్‌కు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. మిగిలిన తొమ్మిది సెగ్మెంట్లలో తెలుగుదేశానికి నలుగురు, వైకాపాకు ఐదుగురి బలం ఉంది. ఒక ఓటు మెజార్టీతో ఉన్న వైకాపా ఎంపిపి అభ్యర్థిగా చేవేండ్ర ఎంపిటిసి రాజులపాటి అచ్యుతరావును ఇప్పటికే ఖరారు చేసింది. గతం మాదిరిగా ఐదుగురు వైకాపా సభ్యుల్లో ఒకరిని తెలుగుదేశం పార్టీ వైపునకు లాక్కుని మళ్లీ ఎంపిపి పదవిని దక్కించుకోవాలన్న కృతనిశ్చయంతో టిడిపి నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎంపిపి పదవి బిసి జనరల్‌కు కేటాయించటంతో ఆ వర్గానికి చెందిన వైకాపా ఎంపిటిసిని టిడిపికి గూటికి తీసుకొచ్చి అతనికే ఎంపిపి పదవిని కట్టబెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా బిసి వర్గానికి చెందిన కొంకేపూడి ఎంపిటిసి దావు భైరవలింగంకు గాలం వేస్తున్నారు. ఈయన గతంలో టిడిపిలో కొనసాగారు. కొన్ని పరిస్థితుల కారణంగా ప్రస్తుతం వైఎస్‌ఆర్‌సిపిలో ఉన్నారు. టిడిపి వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు వైఎస్‌ఆర్‌సిపి కూడా మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఉప ఎన్నికకు మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండటంతో వైకాపా క్యాంప్ రాజకీయాలకు తెరలేపింది. తన పార్టీకి చెందిన ఐదుగురు సభ్యుల్లో ఏఒక్కరూ చేజారకుండా ఉండేందుకు వాళ్లందరినీ క్యాంప్‌కు పంపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ఐదుగురు సభ్యుల జాడ మండలంలో కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో టిడిపి వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో వేచిచూడాల్సిందే!