కృష్ణ

తెలుగు జాతిరత్నం ‘మండలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, సెప్టెంబర్ 25: తెలుగు జాతిరత్నం దివంగత మండలి వెంకట కృష్ణారావు వర్ధంతి సందర్భంగా మంగళవారం ఉదయం 10గంటలకు అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ముగ్గురు ప్రముఖులకు మండలి వెంకట కృష్ణారావు స్మారక పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు ఆయన తనయుడు, శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ వర్ధంతి కార్యక్రమాలను వివరించారు. ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుడు పద్మశ్రీ డా. ఎస్‌వి రామారావు, ప్రముఖ సినీ గీత రచయిత, సాహితీవేత్త డా. భువనచంద్ర, ప్రపంచ ప్రఖ్యాత ఛాయాచిత్రకారుడు తమ్మా శ్రీనివాసరెడ్డిలకు ఈ పురస్కారాలు అందించనున్నట్లు తెలిపారు. దివంగత రాష్టప్రతి డా. కెఆర్ నారాయణన్ చేతులమీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని డా. ఎస్‌వి రామారావు అందుకున్నారన్నారు. 1959లో లండన్ కామన్‌వెల్త్ నైరూప్య చిత్రకళా ప్రదర్శనలో అంతర్జాతీయ గుర్తింపు పొందారన్నారు. అమెరికాలోని అత్యున్నత విద్యావేత్తల జీవిత చరిత్రల్లో డా. రామారావు జీవిత చరిత్రను చేర్చారని చెప్పారు. అనేక సాహిత్య పత్రికల్లో ఆయన రచనలు ప్రచురితమయ్యాయని తెలిపారు. ప్రస్తుతం ఈయన చికాగోలో భార్య డా. సుగుణతో కలిసి జీవిస్తున్నారు. వీరి కుమార్తె పద్మావతి ప్రముఖ నాట్య కళాకారిణి. ఇక డా. భువనచంద్ర 18 సంవత్సరాల పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేశారు. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో కూడా ఈయన పాల్గొన్నారు. విజయ బాపినీడు ఈయనలోని ప్రతిభను గుర్తించి ‘నాకు పెళ్ళాం కావాలి’ సినిమాకు పాటలు రాసే అవకాశమిచ్చారు. ఈ పాటలు విజయవంతం కావటంతో పాటల రచయితగా స్థిరపడ్డారు. అప్పటి నుండి 2వేల పాటలు రాశారు. కృష్ణా జిల్లా నూజివీడు దగ్గర ఈయన స్వగ్రామం కాగా చింతలపూడి ఉన్నత పాఠశాలలో, శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసించారు. అంతర్జాతీయ ఖ్యాతిపొందిన ఫొటోగ్రాఫర్ శ్రీనివాసరెడ్డి ఇండియా టుడేకు ఫొటో జర్నలిస్టుగా పనిచేసి 39 మెడల్స్, 93 అవార్డులు, 387 మెరిట్ సర్ట్ఫికెట్లు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పొందారు. బెలూన్లు అమ్ముకునే ఒక పాప ఫొటో తీయగా, ఇండోర్‌కు చెందిన పత్రిక ముఖచిత్రంగా ప్రచురించింది. అది చూసి ఆ పాప తల్లిదండ్రులు విజయవాడలో తప్పిపోయిన బిడ్డను వెతుక్కుంటూ వచ్చి కలుసుకోగలిగారు. ఆయన తీసిన ఫొటో ఆవిధంగా బిడ్డను, తల్లిదండ్రులను కలిపింది. 2016 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం కళారత్న, హంస పురస్కారంతో ఈయనను సత్కరించింది. ప్రపంచంలోని 10 మంది ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్లలో శ్రీనివాసరెడ్డి ఒకరిగా ఇటీవల గుర్తింపు పొందటం తెలుగుజాతికి గర్వకారణంగా బుద్ధప్రసాద్ వివరించారు.