కృష్ణ

పంట పొలాలను ముంచిన భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందర్లపాడు, సెప్టెంబర్ 25: వారం నుండి కురుస్తున్న వర్షాలకు తోడు ఆదివారం చందర్లపాడు మండలంలో కురిసిన భారీ వర్షానికి పంట పొలాలు నీట మునిగాయి. జూన్‌లోనే పత్తి వేయటంతో పంట చేతికొచ్చే సమయానికి కురుస్తున్న వర్షాలకు పత్తికాయలు నల్లబడి దిగుబడి పూర్తిగా తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎకరాకు రూ.20వేలు కౌలు చె ల్లించి వేలాది రూపాయలు పెట్టుబడు లు పెట్టి పంట చేతికొస్తుందన్న సమయంలో వర్షాలు నిండా ముంచా యి. ఇప్పటికే గూడ మొత్తం రాలిపోగా ఉ న్న కాయలు నల్లగా మారిపోయాయి. మిరప చేలలో నీరు నిలవటంతో మొక్కలు వడబడి పోయి ఎండి పోతున్నాయి. వర్షాలు కొనసాగితే పంటలు పూర్తిగా దెబ్బతింటాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.