కృష్ణ

నాది ‘పాల పార్టీ’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి: రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కృష్ణామిల్క్ యూనియన్ శ్రేయస్సు కోసం తాను అన్ని పార్టీలతో సఖ్యతగా ఉంటానని, తనది ‘పాల పార్టీ’ అని ఛైర్మన్ మండవ జానకిరామయ్య అన్నారు. వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన పాల సరఫరా, పాల రైతులకు అత్యధిక ధరను చెల్లించి ఏడాదికి రూ.560 కోట్ల టర్నోవర్‌తో రాష్ట్రంలోని అన్ని మిల్క్ యూనియన్‌ల కన్నా కృష్ణామిల్క్ యూనియన్ అగ్రభాగాన నిలిచిందని తెలిపారు. కృష్ణామిల్క్ యూనియన్‌కు 6వ విడత ఛైర్మన్‌గా ఎన్నికైన ఆయన మొవ్వ సొసైటీ అధ్యక్షులుగా తొలిసారిగా ఆదివారం గ్రామానికి వచ్చారు. ఈసందర్భంగా మొవ్వ పాల సొసైటీలో జానకిరామయ్య విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాలోని వినియోగదారులకు 3లక్షల లీటర్ల పాలు అవసరం కాగా కేవలం లక్షా 60వేల లీటర్లే సేకరణ జరుగుతోందన్నారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా పాలు సరఫరా చేసేందుకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండే కాకుండా రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాల నుండి పాలు కొనుగోలు చేసి ఈ సమస్యను అధిగమిస్తున్నట్లు తెలిపారు. నాణ్యమైన పాల సరఫరా తమ ఏకైక లక్ష్యంగా కృష్ణా మిల్క్ యూనియన్ కృషి చేస్తోందన్నారు. నష్టాల ఊబిలో చిక్కుకున్న కృష్ణామిల్క్ యూనియన్‌కు నాడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు సూచనల మేరకు ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. జాతీయ పాల ఉత్పత్తి సంఘం, గుజరాత్ రాష్ట్రానికి చెందిన కురియన్ సహకారంతో విఆర్‌ఎస్ పథకం ద్వారా 2వేల మంది సిబ్బందిని తగ్గించి వెయ్యి గ్రామాల్లో పాల సేకరణ చేపట్టినట్లు తెలిపారు. రూ.540కోట్ల నికర లాభంతో కృష్ణామిల్క్ యూనియన్ ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.10 కోట్లను విరాళంగా అందించిందన్నారు. 1991 నుంచి ఇప్పటివరకు రూ.2,500 కోట్లు రైతులకు బోనస్ చెల్లించిన సంస్థ కృష్ణామిల్క్ యూనియన్ ఒక్కటేనని ఆయన స్పష్టం చేశారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 500 మంది సిబ్బందితో రూ.550కోట్లు టర్నోవర్ సాధించామన్నారు. 10శాతం వెన్న కలిగిన లీటరు పాలకు రూ.54లు చెల్లిస్తున్నట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రూపాయికి పది పైసల వంతున రెండుసార్లు, 12.50 పైసల వంతున ఒకసారి మొత్తం రూ.61కోట్లు బోనస్‌గా చెల్లించినట్లు జానకిరామయ్య వివరించారు. ఈ సమావేశంలో మండవ అంకినీడు, కొల్లి నాగకోటేశ్వరరావు, గుప్తా వెంకటేశ్వరరావు, మండవ కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.