కృష్ణ

రైతు బజారు ఆవరణలో సిసి రోడ్డు నిర్మించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), అక్టోబర్ 13: రైతు బజారు స్థలంలో సిసి రోడ్డును నిర్మించాలని కోరుతూ రైతులు గురువారం మార్కెట్ యార్డు కమిటీ ఛైర్మన్ గోపు సత్యనారాయణ, రైతు బజారు ఎస్టేట్ ఆఫీసర్ ఎల్ బలిచక్రవర్తిలకు వినతిపత్రం అందించారు. వర్షం కురిస్తే రైతు బజారులో నీరు చేరటంతో స్థానిక రైతులు, రైతు బజారుకు వచ్చే వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, అన్‌లోడింగ్ చేసుకోవటానికి చాలా ఇబ్బందిగా ఉందని వాపోయారు. రైతు బజారు స్థలంలో సిసి రోడ్డు నిర్మిస్తే అన్‌లోడింగ్ చేయటానికి వీలుంటుందన్నారు. అలాగే వర్షం నీరు కూడా నిల్వ ఉండదన్నారు. స్పందించిన ఛైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ కమీషనరు, వ్యవసాయ మార్కెటింగ్ సంచాలకులు గుంటూరు వారిని కలిసి వారి అనుమతి తీసుకుని వెంటనే సిసి రోడ్డు నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. రైతు బజారు అభివృద్ధి కోసం రూ.24లక్షలు ఇవ్వటం జరిగిందన్నారు. ప్రస్తుతం మరలా నూతనంగా రూ.3.75లక్షలు రైతు బజారులోని ఎలక్ట్ఫ్రికేషన్ నిమిత్తం మంజూరు చేయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.