కృష్ణ

ఏ ఒక్కరూ అధైర్యపడవద్దు అండగా నేనుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 3: సమాజంలో విభిన్న ప్రతిభావంతులు ఎవరికీ తక్కువ కాదని అవకాశాలు కల్పిస్తే అందలం ఎక్కగలరని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఏ తప్పూ చేయకపోయినా ఇలా జన్మించామంటూ ఏ ఒక్కరూ అధైర్యపడవద్దని, ఇతరులను నిందిస్తూ బాధపడవద్దు.. అండగా నేనున్నానంటూ హర్షధ్వానాల మధ్య భరోసా ఇచ్చారు.
విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు శనివారం ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు అనేక హామీలు గుప్పించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగానున్న 300 బ్యాక్‌లాగ్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2500 ట్రై సైకిళ్లు, వీల్‌చైర్ మోటార్‌లు అందజేస్తామన్నారు. వివాహ ప్రోత్సాహక బహుమతి కింద లక్ష రూపాయలు ఇవ్వగలమన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంప్స్ నిర్మాణం, అనంతపురం, కాకినాడలలో ప్రత్యేకంగా హోమ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. నెల్లూరులో సమీకృత పునరావాస కేంద్రం ఏర్పాటుకు కేంద్రం రూ.31కోట్లు కేటాయించిందన్నారు. గతంలో రూ.34కోట్లుగా ఉన్న రాష్ట్ర బడ్జెట్‌ను రూ.77 కోట్లకు పెంచామన్నారు.
సభలో పాల్గొన్న మంత్రులు, నాయకులు తమ ప్రసంగాల్లో చంద్రబాబును విభిన్న ప్రతిభావంతుల ఆశాకిరణం మన చంద్రన్న అంటూ ప్రశంసలతో ముంచెత్తారు.
సభలో స్ర్తిశిశు విభిన్న ప్రతిభావంతుల శాఖ మంత్రి పీతల సుజాత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, మేయర్ కోనేరు శ్రీ్ధర్, సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, మేనేజింగ్ డైరక్టర్ కెఆర్‌బిహెచ్‌ఎన్ చక్రవర్తి, కూచిపూడి అభివృద్ధి బోర్డు చైర్మన్ కూచిభొట్ల ఆనంద్, శాప్ చైర్మన్ పిఆర్ మోహన్, ఐఎఎస్ అధికారులు ప్రద్యుమ్న, జయలక్ష్మి, పూనం మాలకొండయ్య, కలెక్టర్ బాబు.ఎ, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో విభిన్న ప్రతిభావంతులు హాజరయ్యారు.