కృష్ణ

చీటీల పేరుతో రూ.కోటి పైగా కుచ్చుటోపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), మే 19: చీటీపాట వేసి లబ్దిదారులను మోసం చేసి కోటి రూపాయలకు పైగా కుచ్చుటోపీ పెట్టిన వ్యక్తిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఇనుగుదురు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజుపేట గ్రామానికి చెందిన అన్నం రాధాకృష్ణమూర్తి 25 సంవత్సరాలుగా చీటీలు వేస్తున్నాడు. పాట దారులను నమ్మించి చీటీలు కట్టిన వారికి డబ్బులు చెల్లించ కుండా సుమారు కోటి రూపాయలకు పైగా కుచ్చుటోపీ పెట్టి పరారయ్యాడు. లబ్ధిదారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు శనివారం స్థానిక మూడు స్థంబాల సెంటరు వద్ద నిందితుడు రాధాకృష్ణమూర్తి ఉన్నట్లు సమాచారం తెలవటంతో హుటాహుటిన పోలీసులు అక్కడకు చేరుకుని నిందితుడిని అరెస్టు చేసి కేసునమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఎండ తీవ్రతకు పేలిన ట్రాన్స్‌ఫార్మర్
బెంజిసర్కిల్, మే 19: రోజురోజుకూ పెరుగుతున్న ఎండ తీవ్రతకు ఒకవైపు ప్రజలు అల్లాడుతుంటే, మరోవైపు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు దగ్ధవౌతున్నాయి. నగరంలోని హోటల్ డీవీ మేనర్ రహదారిలో శనివారం ఎండ తీవ్రతకు ట్రాన్స్‌ఫార్మర్ పేలి మంటలు ఎగిసిపడ్డాయి. మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ఈ ట్రాన్స్‌ఫార్మర్ నుండి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీనిపై పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి చుట్టుపక్కల వారు సమాచారం అందించడంతో వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ సకాలంలో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.

ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయం గెలిచింది
* కర్నాటక పరిణామాలపై ఎంపీ కేశినేని నాని
విజయవాడ, మే 19: కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు నీతి నిజాయితీకి కట్టుబడి ఉన్నారని, వందల కోట్లు ఇస్తామన్నా, మంత్రి పదవులు ఇస్తామన్నా కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగలేదని, ప్రజాస్వామ్య వ్యవస్థలో నేడు శుభదినమని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేసిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యంపై ఆశలు చిగురించి న్యాయవ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థనూ గత మూడు రోజులుగా జరుగుతున్న ఆందోళన నేటితో తెర దించిందన్నారు. గతంలో మణిపూర్, మేఘాలయ, గోవాలలో చక్రం తిప్పి అధికారాన్ని చేజిక్కించుకున్నట్లు కర్ణాటకలో వారి నాటకాలు కుదరలేదన్నారు. మోదీ, అమిత్‌షా పతనం నేటి నుండి ప్రారంభమైందన్నారు. విజయసాయిరెడ్డి బెంగళూరు రాజకీయాలతో బీజేపీ, వైసీపీ బంధం ప్రజలకు అర్ధమైందని, రేపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా వైసీపీకి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. విభజన చట్టంలోని హామీలను వెంటనే బీజేపీ ప్రభుత్వం నెరవేర్చి ఆంధ్ర ప్రజలకు న్యాయం చేయాలన్నారు.