కృష్ణ

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువూరు, మే 15: ప్రజల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని వైద్య విద్య, ఆరోగ్య శాఖ మంత్రి డా. కామినేని శ్రీనివాస్ చెప్పారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని, ఇందుకోసం ముఖ్యంగా పేద వర్గాల కోసం ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథకంతో పాటు పలు వినూత్న పథకాలు అమలు చేస్తోందన్నారు. మండలంలోని రాజుగూడెంలో 78 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని విజయవాడ ఎంపి కేశినేని శ్రీనివాస్‌తో కలిసి ఆదివారం ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య పరీక్షలు, మందులు, శస్త్ర చికిత్సలు, ఇతర వైద్య సేవలు అందిస్తున్నందున అన్ని వర్గాల ప్రజలు వాటిని సద్వినియోపర్చుకోవాలని కోరారు. ప్రభుత్వం ఆసుపత్రుల అభివృద్ధి, సౌకర్యాల కల్పనకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నందున ప్రభుత్వాసుపత్రుల వైపు ప్రజలు మొగ్గుచూపాలన్నారు. డిఎంహెచ్‌ఓ నాగమల్లేశ్వరి, ఎంపిపి గద్దె వెంకటేశ్వరరావు, ఎఎంసి చైర్మన్ తాళ్ళూరి రామారావు, జడ్‌పిటిసి కిలారు విజయబిందు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సగ్గుర్తి శ్రీనివాసరావు, నియోజకవర్గ, మండల, పట్టణ బిజెపి అధ్యక్షులు ధారా మాధవరావు, గుర్రం వెంకటేశ్వరరావు, వేంపాటి అబ్రహం, తదితరులు పాల్గొన్నారు.