కృష్ణ

విద్యార్థులు నైపుణ్యాల్ని పెంచుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), మే 15: విద్యతో పాటు నైపుణ్యాల్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ హాలులో ఆదివారం కృష్ణా విశ్వవిద్యాలయం, ఏపి స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్వహించిన చంద్రన్న జాబ్‌మేళాలో వివిధ కంపెనీల ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఆయన ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ.. యువతను అత్యంత శక్తిమంతులుగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏపి స్టేట్ నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసిందన్నారు. లక్ష మందికి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకెళుతున్నారన్నారు. 17 కేంద్రాల ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నైపుణ్యాల పెంపుదలకు శిక్షణ ఇచ్చిన 1500 మందిలో 350 మంది ఉద్యోగాలు సాధించటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. గతంలో 42 ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా చంద్రబాబు నాయుడు వాటిని 500లకు పెంచినట్లు తెలిపారు. పలు దేశాల్లో పేరొందిన కంపెనీల్లో సిఇఓలుగా తెలుగువారు ఉండటం ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతకు తార్కాణమన్నారు. ఎంపి కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. సమర్ధత, అనుభవం కలిగిన నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్భ్రావృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ మాట్లాడుతూ అభ్యర్థులు అవకాశాలను అందిపుచ్చుకుంటూ, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించారు. విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ఎస్ రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటిసి లంకే నారాయణ ప్రసాద్, మార్కెట్ యార్డు ఛైర్మన్ గోపు సత్యనారాయణ, కౌన్సిలర్ శ్రీవాణి, పాల్గొన్నారు.