కృష్ణ

ఐలయ్యను వెంటనే అరెస్టు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), మే 15: బ్రాహ్మణులపై విమర్శలు చేసే స్థాయి జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ కంచె ఐలయ్యకు లేదని రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు పివి ఫణికుమార్ అన్నారు. కంచె ఐలయ్యను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం స్థానిక కోనేరు సెంటరులో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ఆధ్వర్యంలో రోడ్డుపై ధర్నా చేశారు. ఈసందర్భంగా ఫణికుమార్ మాట్లాడుతూ బ్రాహ్మణులు తిని కూర్చునే సోమరులు కాదని, దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రాహ్మణులది కీలకపాత్ర అని గుర్తుచేశారు. దేశం కోసం బ్రాహ్మణులు ఎన్నో త్యాగాలు చేస్తే ఈరోజు కంచె ఐలయ్యలాంటి స్వార్థపరులు ఆ ఫలితాలను అనుభవిస్తూ బ్రాహ్మణులపై అవాకులు, చవాకులు పేలటం తగదని హితవు పలికారు. కంచె ఐలయ్య పత్రికాముఖంగా బ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో పభుత్వపరంగా ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫణికుమార్ డిమాండ్ చేశారు. ధర్నాలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన యువజన విభాగం జిల్లా అధ్యక్షులు లొల్లా కుటుంబశాస్ర్తీ, సభ్యులు గాదే శ్రీనివాస్, జొన్నలగడ్డ శ్రీనివాస్, చినముత్తేవి సూర్యప్రకాశరావు, కుప్పా శ్రీకృష్ణమూర్తి, తంగిరాల సుబ్రహ్మణ్య కుమార్, గాయత్రి పురోహిత బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు లక్కావజ్జుల రామకృష్ణ, కార్యదర్శి తనికెళ్ళ హరినాథ్ పాల్గొన్నారు.