కృష్ణ

వేట నిషేధ కాలంలోనే నష్టపరిహారం చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), మే 15: సముద్రంలో వేటను నిషేధించిన ప్రభుత్వం మత్స్యకారులందరికీ వేట నిషేధ కాలంలోనే నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల సంఘం (ఎంకెఎంకెఎస్) ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కోనేరు సెంటరులో 36గంటల రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. రాష్ట్ర వృత్తిదారుల సమన్వయ కమిటీ కన్వీనర్ ఎం రామకృష్ణ దీక్షను ప్రారంభించి మాట్లాడుతూ గత ఏప్రిల్ 15 నుండి రెండు నెలల పాటు సముద్రంలో చేపల వేటను నిషేధించిన ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం వేట నిషేధ సమయంలో సహాయాన్ని 86,948 మందికి ప్రకటించిన ప్రభుత్వం ఈ ఏడాది దాన్ని 60 వేల మందికి కుదించడం దుర్మార్గమన్నారు. వేట నిషేధ సమయంలో రాష్ట్రంలోని తొమ్మిది కోస్తా జిల్లాల్లోని 609 గ్రామాల్లో లక్షల మంది మత్స్యకారులు జీవనోపాధిని కోల్పోతున్నారన్నారు. వేట నిషేధ కాలంలో ఒక్కో కుటుంబానికి రూ.8వేల నగదు, బియ్యం, పప్పులు, కిరోసిన్ సరఫరా చేయాలన్నారు. బోట్ రెన్యువల్‌తో నిమిత్తం లేకుండా ప్రతి కుటుంబానికి పరిహారం ఇవ్వాలన్నారు. సముద్రంలో మత్స్య సంపదకు ముప్పు తెస్తున్న విషతుల్య పరిశ్రమలను నిరోధించాలన్నారు. మరబోట్లకు సబ్సిడీతో డీజిల్ సరఫరా చేయాలన్నారు. తొలుత పెదశింగు లక్ష్మణరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి కాటూరి నాగభూషణం, ఎల్‌ఐసి ఏజెంట్స్ నాయకులు రాజారావు, అగ్నికుల క్షత్రియ సంఘం నాయకులు శేషు, సిఐటియు నాయకులు జయరావు రిలే దీక్షకు సంఘీభావం తెలిపారు. సంఘం డివిజన్ కార్యదర్శి ఒడుగు గంగాధర ప్రసాద్, అండ్రాజు దుర్గారావు, బస్వాని నీలాజం, నాయుడు ఏసుదాసు, మోకా వెంకటేశ్వరరావు, కొల్లాటి దుర్గ, తమ్ము చాందినీ, తమ్ము కిషోర్, మత్స్య కార్మికులు పాల్గొన్నారు.