కృష్ణ

చంద్రబాబు నాయకత్వంలో నిరంతర అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఆగస్టు 20: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో నిరంతర అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని శాసనమండలి సభ్యుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అర్జునుడు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను సరిగ్గా లేకున్నప్పటికీ రాష్ట్రాన్ని పారిశ్రామిక, సంక్షేమ రంగాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువెళుతున్నారన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే వాటిని అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యవహరిస్తున్నారంటూ దుయ్యబట్టారు. అధికారంలోకి రావాలనే కాంక్ష తప్ప రాష్ట్ర ప్రయోజనాలు జగన్‌కు పట్టడం లేదన్నారు. కేవలం తన వ్యక్తిగత స్వార్ధం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కుతూ జగన్ రాజకీయాలు చేస్తున్నాడని ఘాటుగా విమర్శించారు. పల్నాడు గనుల కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించదన్నారు. అయితే జగన్ సీఐడీ మీద నమ్మకం లేక ఆ కేసులు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీబీఐ మీద జగన్‌కు అంత నమ్మకం ఉంటే అతని మీద అవినీతి అక్రమార్జన కేసులు నమోదు చేసింది సీబీఐ కాదా అని ప్రశ్నించారు. తన మీద సీబీఐ కేసులు నమోదు చేస్తే విమర్శించే జగన్ పల్నాడు గనుల కేసును సీబీఐకి అప్పగించాలని ఎలా డిమాండ్ చేస్తారని ప్రశ్నించారు. కొత్తగా పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ కూడా అవగాహనా రాహిత్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నాడని విమర్శించారు. 40 యేళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడుకు ధీటైన ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రంలో ఎవ్వరూ లేరన్నారు. రాష్ట్ర ప్రజలు విశ్వసనీయతను చూరగొన్న చంద్రబాబు నాయుడుని రానున్న ఎన్నికల్లో కూడా ప్రజలు సీఎం చేయడం ఖాయమన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్ నాయుడు మాట్లాడుతూ పట్టిసీమ పుణ్యమా అంటూ నేడు డెల్టాలో వరి పంట భారీ వర్షాలకు గురి కాలేదన్నారు. ఇది కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపు పాలనకు నిలువెత్తు నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా కార్యదర్శి పివి ఫణి కుమార్ పాల్గొన్నారు.

మళ్ళీ పోటెత్తిన వరద
తోట్లవల్లూరు, ఆగస్టు 20: తోట్లవల్లూరు మండలంలోని కృష్ణానదీపాయలకు సోమవారం వరద పోటెత్తింది. మధ్యాహ్నం నుంచి వరద తీవ్రత పెరిగి పాయలు నిండుకున్నాయి. ప్రకాశం బ్యారేజ్ నుంచి 1.50 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారని తహశీల్దార్ జి భద్రు తెలిపారు. ఉదయం నుంచి 12 గంటల వరకు కాలినడక ఉండటంతో కూలీలు, రైతులు స్వేచ్ఛగా లంకలకు వెళ్లారు. వారం రోజుల క్రితం వచ్చిన వరద తగ్గిపోయి అన్ని లంక గ్రామాల రేవుల్లో కాలినడకతో రాకపోకలు సాగించే పరిస్థితి కలిగింది. అయితే మధ్యాహ్నం నుంచి హఠాత్తుగా వరద పోటెత్తింది. దీంతో లంక గ్రామాలకు పడవలు వేయటం ప్రారంభించారు. తోట్లవల్లూరు లంకలో తమలపాకు తోటల నుంచి తమలపాకు బుట్టలను పడవలపై రైతులు తీసుకు వచ్చారు. అలాగే లంకలు వెళ్లిన కూలీలను పడవలపై ఇవతలకు చేర్చారు. కృష్ణానదీపాయలకు వచ్చిన వరదను తోట్లవల్లూరు రేవులో సోమవారం సాయంత్రం నియోజకవర్గ స్పెషలాఫీసర్, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ సత్యనారాయణరాజు, మండల స్పెషలాఫీసర్ శ్రీనివాసరావు, తహశీల్దార్ జి భద్రు పరిశీలించారు. మండలంలో ఎనిమిది లంక గ్రామాల్లో 3వేల మంది ప్రజలు ఉన్నారని భద్రు చెప్పారు. అన్ని గ్రామాల్లో సిబ్బందిని పెట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. పడవల్లో 20 మందికి మించి ఎక్కటుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. లంక గ్రామాల ప్రజలు అధికారులకు సహకరిస్తు జాగ్రత్తగా ఉండాలని సత్యనారాయణరాజు విజ్ఞప్తి చేశారు.