కృష్ణ

తగ్గుముఖం పట్టిన వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఆగస్టు 20: గడిచిన మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు తగ్గుముఖం పట్టాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత మూడు రోజులుగా భారీ వర్షాలు జిల్లా వాసులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. భారీ వర్షాలకు జిల్లాలో పాక్షికంగా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. సోమవారం వర్షాలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో నష్టం అంచనాల్లో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. శెలవులో ఉన్న జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం మధురై నుండి టెలీకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికార యంత్రాంగానికి సహాయక చర్యలపై దిశా నిర్ధేశం చేశారు. అలాగే ఇన్‌ఛార్జ్ కలెక్టర్ కె విజయకృష్ణన్ కూడా భారీ వర్షాలపై నిరంతరం అధికారులతో పర్యవేక్షిస్తున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టినా ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు భారీగా వస్తోంది. ప్రకాశం బ్యారేజీ నుండి భారీగా వరద నీటిని దిగువకు విడుదల చేయటంతో కృష్ణానదీ పరివాహక ప్రాంతాల వాసులు ఆందోళనకు గురవుతున్నారు. వరద నీటి ఉధృతి కారణంగా పలు లంక గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. అటువంటి గ్రామాలను అధికారులు ముందుగానే గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. వర్షాలు తగ్గు ముఖం పట్టిన నేపథ్యంలో గ్రామాల్లో ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పంచాయతీ రాజ్ అధికారులు గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలను మెరుగుపరుస్తుండగా రెవెన్యూ, వ్యవసాయ శాఖాధికారులు పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలు వేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖాధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు.

నష్టం అంచనాలపై సమగ్ర నివేదికలు తయారు చేయాలి : కలెక్టర్ లక్ష్మీకాంతం
భారీ వర్షాల కారణంగా జిల్లాలో జరిగిన నష్టంపై సమగ్రమైన నివేదికలు తయారు చేయాలని కలెక్టర్ లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మధురై నుండి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పశ్చిమ కృష్ణాలో వాగులు, వంకలు పొంగి పొర్లటం వల్ల కొన్ని ప్రాంతాల్లో పంట పొలాలు ముంపునకు గురైనట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ముంపు గ్రామ ప్రజలను తరలించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. బుడమేరు కాలువకు వరద నీరు చేరుతున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్, మెడికల్ తదితర అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు.

ప్రాణ నష్టాన్ని నివారించాం : ఇన్‌ఛార్జ్ కలెక్టర్ విజయకృష్ణన్
అధిక వర్షాల కారణంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా నివారించగలిగామని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ కె విజయకృష్ణన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు భారీ వర్షాలకు జిల్లాలో పాక్షికంగానే నష్టం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 18 గ్రామాలు వరద నీటి ప్రభావానికి గురయ్యాయన్నారు. జిల్లా మొత్తం 108 గృహాలు దెబ్బతినగా అత్యధికంగా నూజివీడు డివిజన్ 77 గృహాలు, అత్యల్పంగా గుడివాడ డివిజన్‌లో రెండు గృహాలు దెబ్బతిన్నట్లు తెలిపారు. విజయవాడ డివిజన్‌లో 29 గృహాలు దెబ్బతినగా బందరు డివిజన్‌లో ఎటువంటి గృహ నష్టం లేదన్నారు. వరద నీటిలో చిక్కుకున్న ఏడుగురిని రక్షించగలిగామన్నారు. నూజివీడు, గుడివాడ డివిజన్‌లలో 42 కిలో మీటర్ల మేర రోడ్లు ధ్వంసమైనట్లు తెలిపారు. పంట నష్టం అంచనాల్లో అధికారులు నిమగ్నమయ్యారని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ తెలిపారు.

వరద బాధితుల పరామర్శలకై పోటాపోటీ
ఢిల్లీ నుండి మంత్రి ఉమ, నియోజకవర్గ గ్రామాల్లో కెపి
మైలవరం, ఆగస్టు 20: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మైలవరం నియోజకవర్గంలోని పలు గ్రామాలలో వరదలు ఇళ్ళలోకి చేరి అనేక ఇబ్బందులు పడుతుండటంతో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త వసంత వెంకట కృష్ణ ప్రసాద్(కెపి)లు పోటా పోటీగా పరామర్శలు చేస్తున్నారు. మంత్రి ఉమ కేంద్ర జలవనరుల శాఖ స మావేశానికి ఆదివారం ఉదయం ఢిల్లీ వెళ్ళారు. ఆయన అక్కడి నుండే తుఫాను వల్ల ని యోజకవర్గంలో జరిగిన నష్టాన్ని, ప్రజల స్థితి గతులను మైలవరం, రెడ్డిగూడెం, జి కొండూరు, ఇబ్రహీ ంపట్నం, విజయవాడ రూరల్ మండలాలలోని ప్ర జాప్రతినిధులు, పార్టీ నేతలతో, అధికారులతో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షించారు. వరద ప్రా ంతాలను అందరూ కలిసి సందర్శించి సహాయక చ ర్యలను చేపట్టాలని, పల్లెలకు, పట్టణాలకు మధ్య తె గిపోయిన సంబంధాలను గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించాలని, వరదల వల్ల నష్టపోయి న వారికి తగు న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రజా ప్రతినిధులు, తెలుగుతమ్ముళ్ళు, అధికారులు వ రద ప్రాంతాలను సందర్శించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి సమస్యల పరిష్కారంలో నిమగ్నమయ్యారు. మరోవైపు మంత్రి ఉమ ప్రత్యర్థి, మైలవరం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కెపి ఉదయం నుండి సాయంత్రం వరకూ ఇబ్రహీంపట్నం మండలంలో నీట మునిగిన పలు గ్రామాలను సందర్శించి అక్కడి ప్రజలతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. వారికి పార్టీ పరంగా ప్రత్యామ్నా యం ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా జి కొ ండూరు మండలంలో పలు గ్రామాలలో పంటలు వరదకు నీట మునగటంతో రైతులతో కలిసి ట్రాక్టరుపై ఆయా పంట పొలాలకు వెళ్ళి స్వయంగా పరిశీలించారు. రైతులతో మాట్లాడి వరద నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఇ టు వరద బాధితులను పరామర్శిస్తూనే మరో వైపు ఇటీవల కాలంలో మరణించిన కుటుంబాలను సైతం కెపి ప రామర్శిస్తున్నారు. ఒక వైపు కెపి, మరోవైపు టీడీపీ నేతల వరద పరామర్శలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.