కృష్ణ

బంటుమిల్లి టీడీపీలో అసమ్మతి సెగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంటుమిల్లి, సెప్టెంబర్ 20: మండల తెలుగుదేశం పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్నా అసమ్మతి బహిర్గతమైంది. అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీపీ పాలడుగు వనవలమ్మపై ఆ పార్టీకే చెందిన ఆరుగురు ఎంపీటీసీలు వైసీపీ ఎంపీటీసీ మద్దతుతో తిరుగుబాటు చేశారు. దీనికి అనుగుణంగా ఆరుగురు తెలుగుదేశం, ఒక వైసీపీ ఎంపీటీసీలు గురువారం ఎంపీపీ వనవలమ్మపై అవిశ్వాసం ప్రకటిస్తూ హుటాహుటిన మచిలీపట్నంలోని జిల్లా ఉన్నతాధికారులకు అసమ్మతి తీర్మానం నోటీసును అందచేశారు. కాగా జెడ్పీ సీఇఓ సెలవులో ఉండడంతో బందరు ఆర్డీఓకు అసమ్మతి నోటీసు అందచేశారు. అనంతరం బంటుమిల్లి మండల పరిషత్ కార్యాలయానికి ఆగమేఘాలపై వచ్చి జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన నోటీసు నకళ్లను ఎంపీడీఓ చింతా కళావతికి కూడా అందచేశారు. ఇది ఇలా ఉండగా వైసీపీ ఎంపీటీసీ బొర్రా రమేష్ సోషల్ మీడియా ద్వారా విలేఖర్లకు సందేశమిస్తూ వైసీపీ అధినేత జగన్‌కు, పెడన మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత జోగి రమేష్ పనితీరును మెచ్చి మండల పరిషత్‌లోని టీడీపీ ఎంపీటీసీలు తమకు మద్దతు ఇచ్చారని, అందువల్లే తాము అసమ్మతి నోటీసును జిల్లా ఉన్నతాధికారులకు అందచేశామంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీలు ఎద్దు జోస్మిన్, పల్లికొండ వెంకటలక్ష్మి, బండారు నాగచంద్ర, కైలా నిర్మల, టీడీపీ మండల అధ్యక్షుడు ఇల్లూరి లీలాకృష్ణ, టీడీపీ నాయకులు కైలా మాధవరాజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. మండల పరిషత్ పరిపాలనలో ఎంపీపీ పాలడుగుల వనవలమ్మ ఆమెకు మండల పరిషత్ ప్రత్యేక సలహాదారుడు అయిన పాలడుగల వీర వెంకటేశ్వరరావు మండల పరిషత్ పాలనను అవినీతిమయం చేశారని, రుణాల మంజూరులో దళారులను ఏర్పాటు చేసి రూ.10వేలు చొప్పున లంచాలు తీసుకున్నారని, అభివృద్ధిలో ఎంపీటీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా అగౌరవపర్చారని, నిధుల కేటాయింపులో ఎంపీటీసీలను చిన్నచూపు చూశారని పేర్కొంటూ ఈ విషయాలపై ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ దృష్టికి తీసుకువెళ్లినా చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. అలాగే ఇళ్లల్లో ఉండే తమను బయటకు తీసుకువచ్చి ఎంపీటీసీలుగా పోటీ చేయించి రెండున్నర సంవత్సరాలు కాలం ఎంపీపీగా ఇస్తామని ఆశ పెట్టారని పల్లికొండ వెంకట లక్ష్మి, ఎద్దు జోస్మిన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీపీ పాలడుగుల వనవలమ్మను, స్పెషల్ అడ్వైజర్ పి వీర వెంకటేశ్వరరావును మార్చకపోతే తమ పదవులకు, పార్టీకి కూడా రాజీనామా చేస్తామని ఎంపీటీసీలు హెచ్చరించారు. వైసీపీ మద్దతుతోనే అవిశ్వాస తీర్మానం పెట్టుకున్నామని, అంతే గాని వైసీపీకి మద్దతుగా అవిశ్వాసం పెట్టలేదని మండల టీడీపీ అధ్యక్షుడు లీలాకృష్ణ స్పష్టం చేశారు.