కృష్ణ

ప్రతిభ, పనితీరు ఆధారంగానే బదిలీల ప్రక్రియ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 18: ప్రతిభ, పనితీరు ఆధారంగానే బదిలీల ప్రక్రియ ఉంటుందని కలెక్టర్ బాబు ఎ తెలిపారు. స్థానిక కలెక్టర్ ఛాంబర్‌లో శనివారం రాష్ట్ర, జిల్లా స్థాయి ఎన్జీవో నాయకులు కలెక్టర్ బాబు ఎ ను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 5ఏళ్లు దాటిన వారికి తప్పనిసరిగా బదిలీ చేపడతామని, 3ఏళ్లు దాటిన వారు ఇచ్చే ఆప్షన్ ప్రకారం బదిలీ ప్రక్రియ ఉంటుందన్నారు. జీరో బేస్‌డ్ ట్రాన్స్‌ఫర్ బదిలీ ప్రక్రియ అనే మాటే ఉత్పన్నం కాదని అధికారులకు ప్రభుత్వం మార్గదర్శకాలపై వివరాలు తెలియజేశామన్నారు. అందుకు విరుద్ధంగా ఎటువంటి బదిలీలు జరగవని తెలిపారు. 3ఏళ్లు దాటిన వారు మాత్రమే సెల్ఫ్ అప్రైజర్ ఆప్షన్ ఫారం అందివ్వాలని, ఆ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని పేర్కొన్నామన్నారు. జిల్లాలో 14,000 మంది పైగా ఉద్యోగులు ఉంటే ఇప్పటివరకు సుమారు 2500 మందికి ఉద్యోగులకు చెందిన డేటా మాత్రమే ఆయా శాఖలు నమోదు చేశారన్నారు. 5 ఏళ్లు దాటిన వారు తప్పనిసరిగా బదిలీ ప్రక్రియలోకి వస్తారని ఏకధాటిగా 5ఏళ్లు ఒకేచోట (ప్రాంతంలో) పనిచేసిన వారికి ఈ నిబంధన వర్తిస్తుందన్నారు.
రాష్ట్ర ఎన్జీవో అధ్యక్షులు పి.అశోక్ బాబు మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి రాజధాని ప్రాంతం అమరావతికి తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అమరావతి వెలగపూడి ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాల ప్రక్రియ ఆధారంగా హైదరాబాద్ నుండి ఉన్నత స్థాయి అధికారులు, అనుబంధ సిబ్బంది తరలిరావడం జరుగుతుందని, ఈ విషయంపై ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చామన్నారు. వెలగపూడి సచివాలయ భవన నిర్మాణాల ప్రగతి దశల వారీగా పూర్తి చేసి అందించడం జరుగుతుందని ఎల్ అండ్ టి కంపెనీ సూచించి అందజేసే నిర్మాణాల ప్రగతి ఆధారంగా పూర్తిస్థాయిలో ఆగస్టు 31 నాటికి రాగలుగుతామని తెలిపారు. ఈ ప్రాంతంలో అద్దె రేట్లు గణనీయంగా పెంచడం జరుగుతోందని కలెక్టర్‌కు తెలిపారు. ప్రతి 15 రోజులకు సచివాలయంలో అంతస్తుల వారీగా నిర్మాణాలను పూర్తి చేసి అందించడం జరుగుతుందని అందుకు అనుగుణంగా తరలింపుపై ఒక నిర్థిష్టమైన ప్రణాళికలతో రావడం జరుగుతుందన్నారు.
పశ్చిమ కృష్ణా అధ్యక్షులు ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ కో-ఆపరేటివ్, ఇరిగేషన్ వంటి శాఖలకు చెందిన అధికారులు జీరో సర్వీసు ఉన్న ఉద్యోగుల నుంచి కూడా ఆప్షన్ ఫారాలు తప్పనిసరిగా ఇవ్వాలని లేకపోతే క్రమశిక్షణ చర్యలు ఉంటాయనే ధోరణిలో హెచ్చరిస్తున్నారని ఆరోపణ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకే ఆ విధంగా ఉత్తర్వులు ఇస్తున్నట్లు అధికారులు పేర్కొనడం పట్ల తగిన విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. గతంలో రెండేళ్లు పనిచేసి వేరొక ప్రాంతానికి బదిలీపై వెళ్లి తిరిగి ఇదే ప్రాంతంలో 3ఏళ్లు సర్వీసు పూర్తి చేసిన వారిని, 5ఏళ్లు ఒకే చోట సర్వీసు పూర్తి చేసిన వారిగా పరిగణిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. పనితీరు ఆధారంగా బదిలీలు చేపట్టడంపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆయన తెలిపారు.
కలెక్టర్‌ను కలిసిన వారిలో ఇక్బాల్, చిరంజీవి, సత్యనారాయణ రెడ్డి, మహిళా ఉద్యోగుల ప్రతినిధి, కార్యదర్శి ఎమ్.సుజాత, పలువురు ఎన్‌జిఓ నాయకులు, వివిధ శాఖలకు చెందిన ప్రతినిధులు తదితరులు ఉన్నారు.

లబ్ధిదారుల పంపిణీకి సింగ్‌నగర్ జీ ప్లస్ త్రీ
పక్కాగృహాలను సిద్దం చేయాలి
విజయవాడ (కార్పొరేషన్), జూన్ 18: సింగ్‌నగర్‌లో నిర్మిస్తున్న జీ ప్లస్ త్రీ పక్కాగృహాల నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేయాలని విఎంసి కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు. నగర పర్యటనలో భాగంగా శనివారం ఉదయం అజిత్‌సింగ్‌నగర్ ఎక్సెల్ ఫ్యాక్టరీ వద్ద నిర్మితమవుతున్న జి ప్లస్ త్రీ పక్కాగృహాలను పరిశీలించిన ఆయన ఇప్పటివరకూ జరిగిన నిర్మాణాలు, ఇంకా జరపాల్సిన నిర్మాణ పనులను పునఃప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 8బ్లాకులకు చెందిన 250 యూనిట్ల నిర్మాణం పూర్తయితే నిరుపేదలకు పంపిణీ చేయవచ్చునని తెలిపారు. సివిల్ పనులు పూర్తయిన గృహాలకు వైరింగ్, నీటి సరఫరా, యుజిడి తదితర సౌకర్యాలతోపాటు రోడ్లు, వీధి దీపాలు వంటి వసతులను సైతం అందుబాటులోకి తీసుకువాలని సూచించారు. విద్యుత్ కనెక్షన్ల కోసం సంబంధిత శాఖాధికారులను సంప్రదించి కనెక్షన్లు ఏర్పాటైయ్యేలా చూడాలన్నారు. సాధ్యమైనంత త్వరగా పనులను పూర్తి చేసి ఈనెలాఖరు నాటికల్లా గృహాలను సిద్ధం చేయాలన్నారు. నీటి సరఫరాకు గాను పంప్ హౌస్‌లను నిర్మించాల్సి ఉందని, ఈలోగా బోరింగ్ పంపులను ఏర్పాటు చేసి తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలన్నారు. ఈగృహాల నిర్మాణం ఇప్పటికే తీవ్ర జాప్యం జరగడం విచారకరమని, ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని వీరపాండియన్ పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో విఎంసి ఎస్‌ఇ పి ఆదిశేషు, ఇఇ హౌసింగ్ బి శ్రీనివాసరావు పాల్గొన్నారు.