కృష్ణ

భక్తుల భద్రతకు ముప్పేనా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఆగస్టు 3: నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా గత ఏడాది నిర్వహించిన గోదావరి పుష్కరాలకు దీటుగా కృష్ణా పుష్కరాలు నిర్వహించాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరేలా కనిపించడం లేదు. పుష్కరాల సమయం సమీపిస్తున్నా అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారయ్యాయి. ఫలితంగా పుష్కర యాత్రికుల భద్రతకు ముప్పు జరిగే ప్రమాదం పొంచి వుందని భయపడుతున్నారు. ఈ నెల 12 నుండి ప్రారంభం కావాల్సిన కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని జిల్లాలో పుష్కర ఘాట్ల నిర్మాణం, రహదార్ల అభివృద్ధికి ప్రభుత్వం నామినేషన్ పద్ధతిన పనులు కేటాయించింది. అయితే ఈ పనులకు పరిపాలనా ఆమోదం ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరగటంతో ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఫలితంగా పుష్కరాల నాటికి పనులు ఏమేర పూర్తిచేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పుష్కర పనుల్లో ప్రభుత్వం చేతులుకాలాక ఆకులు పట్టుకున్న చందాన వ్యవహరిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనుల ఎంపిక, పరిపాలనా ఆమోదంలో జాప్యం వల్ల టెండర్లు పిలవడంలో కూడా కొంతమేర జాప్యం జరిగింది. కొన్ని పనులకైతే రెండు మూడుసార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందుకు రాలేదు. నామినేషన్ పద్ధతిన కేటాయించిన పనుల్లో అధిక శాతం తెలుగు తమ్ముళ్ళు నిర్వహిస్తున్నారు. అనుభవజ్ఞులైన గుత్తేదార్లను పక్కన పెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పనులు చేజిక్కించుకున్న తెలుగు తమ్ముళ్ళు నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు ఇస్తున్నా అధికారులు మిన్నకుండిపోవాల్సి వస్తోంది. అదేమిటంటే తాము ప్రతిపక్షంలో ఉండగా చేతిచమురు వదిలించుకున్నామని, అధికారంలోకి వచ్చాకైనా నాలుగు రాళ్ళు పోగుచేసుకోవద్దా?.. అంటూ వారు బాహాటంగానే ప్రశ్నిస్తుండటం గమనార్హం. ఇదిలావుంటే కృష్ణా పుష్కరాలకు ప్రభుత్వం విస్తృత ప్రచారం కల్పిస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో జిల్లాలో ఎంపిక చేసిన పుష్కర ఘాట్ల నిర్మాణ పనులు నేటికీ పూర్తికాకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. పటిష్ఠంగా నిర్మించి పుష్కర కాలం నిలిచిపోయేలా ఘాట్ల అభివృద్ధి జరగాల్సి ఉండగా చాలాచోట్ల తుదిమెరుగులు దిద్ది చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా భక్తుల భద్రతకు ముప్పు జరిగే ప్రమాదం పొంచి వుందంటున్నారు. ఇకపోతే పుష్కర ఘాట్లకు వెళ్ళే రహదార్ల అభివృద్ధికి కూడా ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. కానీ నిధులకు తగ్గ పనులు జరిగినట్లు కనిపించడం లేదు. మొత్తం మీద జిల్లాలో జరుగుతున్న పుష్కర పనుల్లో పెద్దఎత్తున అవినీతి చోటుచేసుకుంటున్నా సకాలంలో పనులు పూర్తిచేస్తామన్న భరోసా అధికారుల్లోనే కొరవడింది.