కృష్ణ

ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఆగస్టు 3: నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ జిల్లా తెలుగుమహిళ సంఘం ఆధ్వర్యంలో స్థానిక బస్టాండు సెంటరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం నోటికి నల్ల బ్యాడ్జీలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈసందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఆచంట సునీత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేవరకు టిడిపి ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టిడిపి జిల్లా కార్యదర్శి పివి ఫణికుమార్, జిల్లా తెలుగుమహిళ నాయకులు బడుగు ఉమాదేవి, వై వకుళ్ళవి, వరుదు సుధారాణి, పాలపర్తి పద్మజ, అంబటిపూడి నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

కృష్ణా పుష్కరాల సమగ్ర కార్యాచరణ
ప్రణాళిక సిద్ధం
* కలెక్టర్ బాబు ఎ వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఆగస్టు 3: పుష్కర నగర్, పుష్కర ఘాట్లు, పుష్కర విడిది వంటి ప్రాంతాలలోను, రహదారులపైన మద్యంపై నిషేధాలు వర్తించనున్నాయి. వీటికి 500 మీటర్ల దూరంలో ఎటువంటి మద్యం విక్రయాలు జరపరాదని కలెక్టర్ బాబు ఎ తెలిపారు.
ముఖ్యమంత్రి సమక్షంలో ఈ నెల 6న కృష్ణా పుష్కర సమన్వయ శాఖల సిబ్బందికి, అధికారులకు అవగాహనతో కూడిన శిక్షణ, 8న విధులకు హాజరు, వౌలిక సదుపాయాల పర్యవేక్షణపై సమగ్రంగా అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగిందని కలెక్టర్ బాబు ఎ తెలిపారు. స్థానిక ఇరిగేషన్ మంత్రి కార్యాలయ ఆవరణలోని శిక్షణ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాబు ఎ మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా హాజరయ్యే, పుష్కర విధులు నిర్వహించే అధికారులకు, సిబ్బందికి, వలంటీర్లు తదితరాలకు వారు బసచేసే ప్రాంతంలోనే ఆహారం తదితర ఏర్పాట్లను చేయడం జరుగుతుందన్నారు. ఇందుకోసం 1095 విడిది ప్రాంతాలను గుర్తించడం జరిగిందని తెలిపారు. డ్యూటీలు ప్రతిపాదించిన ప్రాంతాలలోనే విధులను నిర్వర్తించవలసి ఉంటుందని, అందుకు సంబంధించి సెక్టర్ ఆఫీసర్ పూర్తిస్థాయి పర్యవేక్షణ చేపట్టాలని బాబు ఎ తెలిపారు. పుష్కరనగర్‌లలో, విడిది ప్రాంతాలలో ఇతర ప్రాంతాల నుండి డ్యూటీలో ఉన్న ఇతర సిబ్బందికి కేర్ టేకర్‌గా ఉత్తమమైన సేవలు అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఉదయం 7 గంటల నుండి ఒంటి గంట వరకు, మరలా ఒంటి గంట నుండి రాత్రి 9 వరకు, రాత్రి 9 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మూడు షిఫ్టులుగా బాధ్యతలు అప్పగిస్తామన్నారు. పుష్కరాల సందర్భంలో సదస్సులు నిర్వహణ చేపడుతున్నామని, జలసంరక్షణ, అమరావతి వనం- మనం, వ్యవసాయం, విద్య, పర్యావరణం, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, పర్యాటకం తదితర 12 అంశాలపై ఆయా రోజులలో కార్యక్రమాల కార్యాచరణ ప్రణాళిక రూపుదిద్దుతున్నామని కలెక్టర్ తెలిపారు.
కృష్ణా పుష్కరాలు- స్వచ్ఛ పుష్కరాలు అనే విధానంలో పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి చేపట్టాలని కలెక్టర్ సూచించారు. శానిటేషన్‌పై మున్సిపల్, పంచాయతీ అధికారులు, సిబ్బంది వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని ఈ విధానంలో అలక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇతర ప్రాంతాల నుండి హాజరయ్యే వ్యక్తులను అతిథులుగా ఆదరించాల్సి ఉంటుందని, వసతి, భోజన సదుపాయం, అల్పాహారం, మంచినీరు, ఇతర వౌలిక సదుపాయాలపై వ్యక్తిగత పర్యవేక్షణ అవసరం అన్నారు. పుష్కరాల విధులలో అత్యవసర సేవల్లో పాల్గొనే సిబ్బందికి, ఇతర సిబ్బందికి ఫ్లోరోసెంట్ డ్రెస్ కోడ్ అమలు చేస్తున్నట్లు, శానిటేషన్, వైద్య, స్విమ్మర్స్ తదితర విభాగాలను గుర్తించడం జరిగిందన్నారు.
పుష్కర యాత్రికులకు మెరుగైన సేవలు అందించేందుకు 400 వైర్‌లెస్ సెట్లను ప్రధానమైన అధికారులకు అందించేందుకు చర్యలు పూర్తి చేశామని కలెక్టర్ బాబు ఎ తెలిపారు. 30 లైఫ్ బోట్ సర్వీసులు, హెలిటూరిజం, అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఆధార్ ఆధారంగా ఐడి కార్డులను జారీ చేయడం జరుగుతుందని వారి సెల్‌ఫోన్ నెంబర్లకు మెసేజ్ రూపంలోను, సమాచారాన్ని అందించడం జరుగుతుందన్నారు. 11న గోదావరి అంత్య పుష్కరాల్లో పాల్గొన్న, పవిత్ర సంగమం ప్రాంతాల్లో కృష్ణా పుష్కరాల ఆవిష్కరణ (కర్టన్‌రైజర్) కార్యక్రమంలో సాయంత్రం పాల్గొన్న భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని కలెక్టర్ తెలిపారు. అనంతరం రాత్రి 9.25కు హారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని ఆయన తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు, యాత్రికుల దిశా నిర్దేశం, అధికార సిబ్బంది బాధ్యతలు వ్యక్తిగతంగా స్వీకరించాల్సి ఉంటుందని పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టే విధంగా వారి తీరు ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రైల్వే డిజియం అశోక్‌కుమార్, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్ కలెక్టర్ సృజన, ఎన్‌డిఆర్‌ఎఫ్ డెప్యూటీ కమాండెంట్ మధుసూధన రెడ్డి, ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు