కృష్ణ

రోజురోజుకీ పెరుగుతున్న బాలకార్మిక వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 3: దేశంలో పెరుగుతున్న బాలకార్మిక వ్యవస్థ బాల్యవిహాహాలు, అక్రమ తరలింపులపై స్వచ్ఛంద సంస్థలు మరింత విస్తృతంగా పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని విజయవాడలో జరిగిన దక్షిణ భారత రాష్ట్రాల స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. స్వచ్ఛంద సంస్థలు చేపట్టే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ సహాయ సహకారాలు అవసరమని వారు పేర్కొంటున్నారు. ప్లాన్ ఇండియా ఇంటర్నేషనల్ అకాడమి ఆఫ్ గాంధీయన్ సొసైటీ సంయుక్త నిర్వహణలో ఎపి, తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు పాండిచ్చేరి, కేరళ రాష్ట్రాల స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సదస్సు విజయవాడలో జరిగింది. 123 సంస్థలకు చెందిన ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. నాలుగు విభాగాలుగా వివిధ అంశాలపై మంగళవారం జరిగిన రెండు రోజుల సదస్సులో చర్చించారు. బాలకార్మి వ్యవస్థ బాల్యవివాహాలు, బాలికల అక్రమ తరలింపు, సెక్స్ వర్క్‌స్‌గా మారుతున్న సామాజిక అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించి ప్రభుత్వానికి నివేదిక అందజేయడంతో పాటు వచ్చే సంవత్సరకాలానికి ప్రణాళిక తయారు చేశారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో పాటు ప్రభుత్వశాఖలకు చెందిన ప్రతినిధులు కూడా సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్లాన్ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ ప్రదీప్ నారాయణ ఎజియస్ నెంబర్ సెక్రటరీ గోపాల కృష్ణమూర్తి రెండు రోజుల సదస్సులో చర్చించిన అంశాలను వివరించారు. వివిధ రకాలుగా పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పని చేయవలసిన అవసరం ఉందని సమాజంలో బాలలకు జరుగుతున్న అన్యాయాలు వేధింపుల నివారణకు ప్రణాళికబద్ధమైన విధానాలతో ముందుకుసాగాలని నిర్ణయించినట్లు వారు తెలిపారు. 6 రాష్ట్రాల స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సదస్సును తొలిరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. దేశంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందినా పిల్లల సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రభుత్వాలు అనేక రకాలుగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్న ప్రయోజనం ఉండటం లేదన్నారు. బాలల సమస్యలను పరిష్కరించేందుకు ప్లాన్ ఇండియా అకాడమి ఆఫ్ గాంధీయన్ స్టడీస్ సంయుక్త నిర్వహణలో బాలల సమస్యలపై చర్చించడం సంతోషకరమని వారు పేర్కొన్నారు. గతంలో కూడా అనేక కార్యక్రమాలను చేపట్టారని మంచి ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. ముగింపు సదస్సులో రిటైర్డ్ ఐపిఎస్ అధికారి ఉమాపతి పాల్గొని ప్లాన్ ఇండియా ఇంటర్నేషనల్ మరియు అకాడమి ఆఫ్ గాంధీయన్ స్టడీస్ సంస్థలు చేపడుతున్న సామాజిక కార్యక్రమాలను అభినందించారు. స్వచ్ఛంద సంస్థలు చేసే కార్యక్రమాలపై ప్రజల్లో విస్తృతమైన ప్రచారం జరగాలన్నారు. అనంతరం ప్లాన్ ఇండియా సీనియర్ ప్రోగ్రాం మేనేజర్ అనితకుమార్ వచ్చే సంవత్సర కాలంలో నిర్వహించ తలపెట్టిన ప్రణాళికను వివరించారు. ఎజిఎస్ పీల్డ్ మేనేజర్ అశోక్‌కుమార్ వందన సమర్పణ చేశారు.

యువత ఆలోచన విధానాలను వెలికితీయాలి
బెంజిసర్కిల్, ఆగస్టు 3: ఎప్పటికప్పుడు యువతలోని ఆలోచనా విధానాలను వెలికితీసి వాటిని అమలు చేయాల్సిన బాధ్యతను యునివర్శిటీలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. బుధవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, యూనివర్శిటీల వైస్‌ఛాన్స్‌లర్‌లు, మండల స్థాయి అధికారులతో కృష్ణాపుష్కలకు సంబంధించిన అంశాలపై ఆయన మాట్లాడారు. పుష్కరాల నిర్వహించే 12 రోజుల పాటు 12 అంశాలపై చర్చా, అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. నవనిర్మాణ దీక్ష, మహాసంకల్పం, జల సంరక్షణ, వ్యవసాయం, విద్యా, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, మెరుగైన పౌష్టిక ఆహారం, పేదరికంపై గెలుపు, ఉపాధికల్పన, పరిశ్రమలు, వౌలికవసతులు, స్వచ్ఛాంధ్రప్రదేశ్, రెండంకెల వృద్ధి, ఇంటర్‌నెట్ థింగ్స్, నాలుగవ పారిశ్రామికరణ విప్లవం వంటి అంశాలపై ఉన్నత పాఠశాల విద్యార్థుల నుండి యూనివర్శిటీల స్థాయి వరకు ఉన్న విద్యార్థులు వారికి ఆసక్తి ఉన్న రంగాలపై వారి ఆలోచనలు, పరిశోధనలను వెలికి తీయాలన్నారు. అందులో భాగంగా వ్యాసరచన, వక్తృత్వ తదితర పోటీలను నిర్వహించాలన్నారు. భిన్నంగా ఆలోచించడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు సాధించడం జరుగుతుందన్నారు. 12 రోజుల పాటు మొక్కలు తప్పకుండా అందరూ నాటే కార్యక్రమాన్ని చేయాలన్నారు. నదుల అనుసంధానం, భూగర్భజల సంరక్షణ, ఇంకుడుగుంతలు వంటి వినూత్నమైన ఆలోచనల ద్వారా గత యేడాది ఆగస్టు నుంచి నేటికి భూగర్భజలాలు 2.95 మీటర్ల మేర పెరిగాయని సిఎం తెలిపారు. ఈ సమావేశంలో కలెక్టర్ బాబు, ఎన్‌టిఆర్ హెల్త్‌యూనివర్శిటీ విసి రవిరాజు, జెసి గంధం చంద్రుడు, జాయింట్ కలెక్టర్ సృజనతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పుష్కర భక్తులకు ఉచిత భోజనం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఆగస్టు 3: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపు అందుకుని గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు స్థానిక ప్రజలు ఇతోధికంగా సేవలు అందించారు. గోదావరి వంటకాలను వారికి రుచి చూపించటం జరిగింది. విజయవాడ పుష్కరాలకు కూడా అదే స్ఫూర్తితో ముందుకువచ్చిన దాతల వివరాలను కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు విడుదల చేయటం జరిగింది. ఆ దాతల వివరాల పరంగా చూస్తే భగవాన్ రమణ సేవా సంఘం వారు ఉదయం, సాయంత్రం 2500 టిఫిన్ పొట్లాలు అందజేయనున్నట్లు, విజయవాడ బ్రాహ్మణ సేవా సంఘం వారు 4000 టిఫిన్స్ ఉదయం 6 నుంచి 9 వరకు అందించనున్నట్లు, విజయ