కృష్ణ

ఇళ్ల స్థలాల కోసం సంఘటిత పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 6: తాము అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తాం, ఇల్లు లేని పేదవాడు అంటూ ఉండటానికి వీల్లేదంటూ ఎన్నికల్లో ప్రచారం చేసి, మేనిఫెస్టోలో పొందుపర్చిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడచినా ఇంతవరకు ఒక ఇల్లు కూడా ఇచ్చిన దాఖలాలు లేవని పలువురు వక్తలు ధ్వజమెత్తారు. లక్షల ఎకరాలు రైతుల నుండి సేకరించి బడా కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నారు తప్ప పేదవానికి రెండు సెట్లు నివాసస్థలం ఇవ్వలేకపోతున్నారని ఆగ్రహించారు. భవిష్యత్‌లో అన్ని జిల్లాల్లో ఇదే అంశంపై అన్ని రాజకీయ పార్టీలను సమీకరించి సభలు, రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా చైతన్యం చేసి ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని తెలియజేశారు. ఇళ్లస్థలాలు, పక్కా ఇళ్లు పేదలకు ఎండమావులేనా? అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన శనివారం స్థానిక హనుమాన్‌పేటలోని దాసరి భవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామీణ పేదలకు ఇళ్లుగాని, ఇళ్ల స్థలాలు గాని ఇచ్చి దాదాపు 20ఏళ్లకు పైనే అయ్యిందని, జనాభా పెరిగి ఒక్కో ఇంట్లో మూడు, నాలుగు కుటుంబాలు నివాసముంటున్నాయని తెలిపారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ఇళ్లు, ఇళ్ల స్థలాలు అనేది అత్యంత ప్రధానమైన అంశమని, ఎన్నికల్లో బిజెపి, టిడిపి తమ మ్యానిఫెస్టోలో పెట్టుకున్న అంశమని గుర్తు చేశారు. పథకాల పేర్లు మారుతున్నాయే తప్ప అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పేదలకు భూమి ఇచ్చేది లేదని స్పష్టం చేసి జీవో కూడా తెచ్చారని గుర్తు చేశారు. వైసిపి నాయకులు కెపి సారథి, పి.గౌతంరెడ్డి మాట్లాడుతూ ఇళ్లు ఇస్తామని జన్మభూమి సభల్లో దరఖాస్తులు తీసుకున్నారని ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదన్నారు. సిపిఐ ఎంఎల్ నాయకుడు డి.హరినాథ్ మాట్లాడుతూ బిజెపి, టిడిపి అధికారంలోకి వచ్చాక దేశంలో కార్పొరేట్ శక్తులన్నీ ఏకమయ్యాయని బలమైన పోరాటం చేస్తే తప్ప వారిని ఎదిరించలేమన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర నాయకుడు నరహరిశెట్టి నరసింహరావు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు మాట్లాడుతూ చంద్రబాబు భూబకాసురుడుగా తయారయ్యారని విమర్శించారు. మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దుర్గ్భావాని, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బుట్టి రాయప్ప, ఎపి గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కోడా భూషణం, సిపిఐ జిల్లా ఇన్‌ఛార్జి కార్యదర్శి సిహెచ్ కోటేశ్వరరావు ప్రసంగిస్తూ పేదల ఇళ్లు ఇళ్ల స్థలాల పోరాటంలో తాము కూడా భాగస్వాములమవుతామని హామీ ఇచ్చారు.