కృష్ణ

అందుబాటులోకి ఇంట్రాసర్కిల్ రోమింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 6: పుష్కరాల సందర్భంలో అన్ని టెలిఫోన్ సర్వీసు ప్రొవైడర్లు ఇంటరాసర్కిల్ రోమింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ బాబు ఎ కోరారు. స్థానిక కలెక్టర్ ఛాంబరులో బియస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్, రిలయన్స్, టాటా డొకొమో తదితర కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు బాబు ఎ మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలకు జిల్లాలో గుర్తించిన 91 ఘాట్లు సెక్టార్ల పరిధిలో మూడున్నర కోట్లు పైగా పుష్కర యాత్రికులు రానున్నారన్నారు. సగటున ప్రతి రోజు 25లక్షలకు పైగా ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ రద్దీ గుర్తించబడిన 6 ముఖ్య రోజులలో 40 లక్షల వరకు రాగల అవకాశం ఉందని కలెక్టర్ తెలియజేశారు. వచ్చే యాత్రికులకు కమ్యూనికేషన్ గ్యాప్ (సమాచారం అందిపుచ్చుకోవడం) లేకుండా ఏ సర్వీసు ప్రొవైడర్ నుంచైనా వేరొక సర్వీసు ప్రొవైడర్‌కు ఫోన్ చేసుకునేందుకు ఇబ్బంది లేకుండా సిగ్నలింగ్ వ్యవస్థను పెంచాలని అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఈ ఏర్పాట్లలో భాగంగా పుష్కర విధుల్లో పాల్గొనే ముఖ్యమంత్రి స్థాయి నుండి దిగువ స్థాయి సిబ్బంది వరకు సెల్ నెంబర్లను అందిస్తామని ఆ నెంబర్లకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేలా సర్వీసు ప్రొవైడర్లు చర్యలు తీసుకోవాలని కలెక్టరు సూచించారు. బిఎస్‌ఎన్‌ఎల్ ఆధ్వర్యంలో 7 శాశ్వత, 14 తాత్కాలిక టవర్‌లను, 2 సిఓడబ్ల్యు (కమ్యూనికేషన్ ఆఫ్ విల్) యూనిట్లను పవిత్ర సంగమం, గుణదల శాటిలైట్ స్టేషన్లలోను ఏర్పాటు చేయడం జరిగిందని బిఎస్‌ఎల్‌ఎల్ జియమ్ తెలిపారు. 7 శాశ్వత కేంద్రాలు, ముక్తేశ్వరపురం, యనమలకుదురు, పెదపులిపాక, చాగంటిపాడు, ఐనపూరు, పులిగడ్డ, వేకమూరు, ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎయిర్‌టెల్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 14 సిఓడబ్ల్యు యునిట్లను ఏర్పాటు చేస్తున్నామని ప్రతినిధులు తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్ కలెక్టర్ జి.సృజన, ట్రైనీ కలెక్టర్లు, సర్వీసు ప్రొవైడర్లు తదితరులు పాల్గొన్నారు.