కృష్ణ

రోడ్డుపక్కనే తాగేస్తున్నారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు: మండల కేంద్రమైన జి.కొండూరులో ఆత్కూరు రోడ్డు వైన్‌షాపు వద్ద రోడ్డు సమీపంలోనే యథేచ్ఛగగా మద్యం తాగుతున్నారు. మందుబాబులు మద్యం దుకాణం తెరవగానే బహిరంగంగా మద్యపానం చేస్తున్నారు. ఈరహదారి ప్రధాన రహదారి. విద్యార్థులు, మహిళలు ఎంతో మంది నిత్యం కందులపాడు, వెల్లటూరు, వెలగలేరు, కోడూరు గ్రామాల నుంచి జి.కొండూరుకు రాకపోకలు సాగిస్తుంటారు. మందుబాబులతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మందుబాబులు పడవేసిన వాటర్ ప్యాకెట్లు, గ్లాసులు ఇతర విసర్జిత పదార్థాలు గుట్టలుగా పడి ఉంటున్నాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలు అక్కడే వేస్తున్నారు. ఆప్రాంతం అపరిశుభ్రంగా మారుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బహిరంగ మద్యపానాన్ని నియంత్రించాల్సి ఉంది.

దాళ్వాకే మొగ్గు
కూచిపూడి, జనవరి 21: మొవ్వ మండలంలో రబీగా దాళ్వా విస్తారంగా సాగవుతోంది. ఇప్పటికే మండల పరిధిలోని పెడసనగల్లు, నర్సంపాలెం, మొవ్వ, కూచిపూడి, పెదపూడి, గూడపాడు తదితర ప్రాంతాలలో ఎంటీయు 1010 రకం దాళ్వాగా సాగవుతోంది. 120 రోజులకు కోతలకు వచ్చే ఈ పంట పట్ల రైతులు ఆసక్తికనబరుస్తున్నారు. పంట కాలువల్లో కొద్దిపాటి కృష్ణా జలాలు ప్రవహిస్తుండటం, భూగర్భ జలాలు లభిస్తుండటంతో మినుము పంట దిగుబడి, ధరలు నిరాశగా ఉండటంతో పలువురు రైతులు దాళ్వా వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. డీజిల్ ఇంజన్లు, విద్యుత్ మోటార్లు ద్వారా సాగు చేస్తున్నారు. మంగళవారం నర్సంపాలెం గ్రామంలో నెల రోజులు కిందట విత్తిన ఎంటీయు 1010 రకం నారు సిద్ధం కావటంతో వరి నాట్లకు సిద్ధం చేస్తున్నారు.