కృష్ణ

అర్హులందరికీ నివేశన స్థలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పమిడిముక్కల: అర్హులందరికీ ఉగాది నాటికి నివేశన స్థలాలు ఇవ్వడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ డా. కె మాధవీలత అన్నారు. గురువారం మండల పరిధిలోని శ్రీరంగాపురం, చొరగుడి గ్రామాల్లో పర్యటించిన ప్రతిపాదిత నివేశన స్థలాల భూములను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో 2.60లక్షల మందికి 4వేల ఎకరాల భూమి అవసరం కాగా ఇప్పటి వరకు 2వేల 600 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అందరికీ ఇళ్లు కార్యక్రమం పనిలో అధికారులంతా నిమగ్నం కావాలన్నారు. ఆమె వెంట డ్వామా పీడీ జివి సూర్యనారాయణ, హౌసింగ్ పీడీ ధనుంజయుడు తదితరులు ఉన్నారు.
బాల్య వివాహాలను అరికట్టండి
మండవల్లి, జనవరి 23: బాల్య వివాహాల వల్ల చిన్నతనంలోనే తల్లి అయ్యి అనేక రుగ్మతలు, రక్తహీనత సమస్యలకు గురి కావాల్సి వస్తుందని ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలను అరికట్టాలని మండవల్లి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారిణి దీప్తి కోరారు. మండలంలోని ఇంగిలింపాకలంకలో బేబి బచావో- బేబి పడావో వారోత్సవాల్లో భాగంగా గురువారం కమ్యూనిటీ హాలులో మహిళలు, కిశోర బాలికలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి మహిళ, బాలికలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, పిల్లలపై జరిగే అకృత్యాల నుంచి పిల్లలు, మహిళలను కాపాడుటకే ప్రభుత్వం దిశ చట్టం తెచ్చిందన్నారు. ప్రతి మహిళా దుష్టశక్తుల నుంచి తాము ఏలా బయటపడాలో మెళుకువలు తెలుసుకోవాలని, ఈ కార్యక్రమంలో హైస్కూలు ప్రధానోపాధ్యాయుడు జి గోపాలకృష్ణ, ప్రాజెక్టు సూపర్‌వైజర్స్ శ్యామల, పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మీ, నరసింహారావు, గాయత్రి, జ్యోతి, చందన, అంగన్‌వాడీ కార్యకర్తలు, పలువురు మహిళలు తదితరులు పాల్గొన్నారు.