కృష్ణ

ఇకపై కృష్ణా వర్సిటీకి అన్నీ మంచిరోజులే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: రానున్న రోజులన్నీ కృష్ణా విశ్వ విద్యాలయానికి అన్నీ మంచి రోజులేనని ఉపకులపతి ఆచార్య డా. కెబి చంద్రశేఖర్ అన్నారు. బందరు మండలం రుధ్రవరంలోని విశ్వ విద్యాలయం నూతన క్యాంపస్ నందు ఆదివారం భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉపకులపతి డా. కెబి చంద్రశేఖర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 31వతేదీ నుండి కొత్త క్యాంపస్‌లోకి విశ్వ విద్యాలయం అడుగు పెట్టబోతుందన్నారు. ఇకపై అన్ని కార్యకలాపాలు కొత్త క్యాంపస్ ద్వారానే సాగుతాయన్నారు. పూర్తి స్థాయిలో తరగతుల నిర్వహణతో పాటు అకడమిక్ కార్యకలాపాలన్నింటినీ ఇక్కడి నుండే కొనసాగిస్తామన్నారు. ఇందుకు అధ్యాపక, అధ్యాకేతర సిబ్బందితో పాటు విద్యార్థుల సహాయ సహకారాలు ఎంతైనా అవసరమన్నారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు విశ్వ విద్యాలయాన్ని వేదికగా మారుస్తామన్నారు. ఫిబ్రవరి 28, 29తేదీల్లో జాతీయ స్థాయి బయో టెక్నాలజీ కాన్ఫరెన్స్‌ను కొత్త క్యాంపస్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. విశ్వ విద్యాలయం అభివృద్ధితో పాటు నాక్ గుర్తింపే లక్ష్యంగా తన పాలన సాగుతుందన్నారు. నాక్ గుర్తింపుతో విశ్వ విద్యాలయం అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వస్తాయన్నారు. తద్వారా విశ్వ విద్యాలయం అన్ని విధాలా అభివృద్ధిపర్చేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కృష్ణారెడ్డిగారి కృష్ణారెడ్డి, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య వైకె సుందరకృష్ణ, పూర్వపు రిజిస్ట్రార్ డా. ఎన్ ఉషా, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్, డా. సిఎం వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు