కృష్ణ

ఎస్సీ పదోన్నతులపై సుప్రీం తీర్పునకు నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం(కోనేరుసెంటర్): ఎస్సీ పదోన్నతుల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ పీసీసీ పిలుపు మేరకు గురువారం స్థానిక లక్ష్మీటాకీస్ సెంటరులో కాంగ్రెస్‌పార్టీ నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ సు ప్రీం కోర్టు అయినా, పార్లమెంట్ అ యినా రాజ్యాంగానికి లోబడి ఉండాలే తప్ప రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉండకూడదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రనుత్వం కళ్లు తెరిచి ఎస్సీలకు అన్యాయం జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాం గ్రెస్ పార్టీ బందరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మహ్మద్ దాదా సాహెబ్, పట్టణ శాఖ అధ్యక్షుడు అబ్దుల్ మతీన్, జిల్లా ఉపాధ్యక్షుడు కోకా ఫణిభూషణ్, జిల్లా ఉపాధ్యక్షుడు పెదపూడి దిలీప్ కుమార్, పట్టణ మహిళా అధ్యక్షురా లు నల్లబోతు కుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి రజియా సుల్తానా, కోశాధికారి వూటుకూరి శాంతిరాజు, కార్యదర్శి పొట్లూరి అమ్మాజీ, కల్లు వెంకటేశ్వరరావు, హైదర్, దత్తుడు, అఖ్తర్, హేమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
శరవేగంగా ముత్యాలంపాడు అభివృద్ధి
జి.కొండూరు, ఫిబ్రవరి 13: మండల పరిధిలోని హవేలీ ముత్యాలంపాడులో శరవేగంగా అభివృద్ధి పనులు చేస్తామని మాజీ జెడ్పీటిసి కాజ బ్రహ్మయ్య పేర్కొన్నారు. ఆయన గురువారం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరు అయిన రూ.49లక్షల నిధులతో సిమెంటు రహదారుల నిర్మాణ పనులను ప్రారంభించారు. బ్రహ్మయ్య మాట్లాడుతూ వౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తోందన్నారు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే వసంత చొరవతో గ్రామాల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయన్నారు. రికార్డు స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైసిపి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అర్హులైన వారికి ఏది అవసరమో అదే గుర్తించి ఇంటి ముంగిటకు తెచ్చి అందచేస్తున్నారని పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన అజెండా అన్నారు. నవరత్నాలను అమలు చేస్తున్నామన్నారు. గ్రామపెద్దలు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.