కృష్ణ

ప్రయాణికుల సౌకర్యార్థమే ధ్యేయంగా పని చేశా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: గడిచిన మూడేళ్లుగా ప్రయాణికుల సౌకర్యార్థం శక్తి వంచన లేకుండా పనిచేసి పూర్తి స్థాయి సంతృప్తితో బదిలీపై రాజమండ్రి వెళుతున్నానని స్థానిక ఆర్టీసీ డిపో మేనేజర్ పిఎన్‌విఎం సత్యనారాయణ మూర్తి అన్నారు. శనివారం తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడేళ్లల్లో మచిలీపట్నం డిపోను ఆదర్శవంతంగా తీర్చిదిద్దగలిగానన్నారు. ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచటంతో పాటు పూర్తి స్థాయిలో నష్టాలను నివారించగలిగానన్నారు. గడిచిన తొమ్మిది మాసాల్లో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సహకారంతో ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలు అందించగలిగానన్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న సుదూర ప్రాంతాలైన విశాఖపట్నం, బెంగుళూరు ఎసీ సర్వీసులతో పాటు హైదరాబాద్‌కు నైట్ రైడర్ ఎసీ సర్వీసును ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, చెన్నై, కాకినాడ, చీరాల, అమలాపురం వంటి ముఖ్యమైన ప్రాంతాలకు కూడా సర్వీసులను ఏర్పాటు చేయగలిగామన్నారు. తాను డీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పుడు స్థానిక డిపో నుండి కేవలం 107 బస్సులు మాత్రమే వివిధ ప్రాంతాలకు తిరిగేవన్నారు. ఇందులో అత్యధికంగా విజయవాడ, ఏలూరుకు తిరిగేవన్నారు. గడిచిన మూడేళ్లల్లో ఆ బస్సుల సంఖ్యను 129కు పెంచామన్నారు. అలాగే రూ.7.54కోట్లు ఉన్న నష్టాన్ని రూ.2.41కోట్లుకు తగ్గించగలిగానన్నారు. మచిలీపట్నం-విజయవాడ నాన్ స్టాప్ బస్సుల ప్రయాణ కాలాన్ని తగ్గించడం వల్ల 80 ట్రిప్పులను కాస్త 100 ట్రిప్పులు వేసే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. చిన్నపాటి వర్షానికే ముంపునకు గురయ్యే బస్టాండ్‌ను కొంత మేర మెరక చేయించటంతో పాటు వౌలిక వసతులు కల్పించామన్నారు. ఒక విధంగా చెప్పాలంటే గడిచిన మూడేళ్లల్లో మచిలీపట్నం ఆర్టీసీ డిపోను ఓ ఆదర్శవంతమైన డిపోగా తీర్చిదిద్దానన్న సంతృప్తితో ఇక్కడి నుండి బదిలీపై వెళుతున్నానని మేనేజర్ మూర్తి తెలిపారు.