కృష్ణ

మహిళల రక్షణకే ‘దిశ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు: ఆపదలో ఉన్న మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం దిశ చట్టాన్ని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అమలు జరుగుతోందని జిల్లా అడిషనల్ ఎస్పీ ఎం సత్తిబాబు చెప్పారు. స్థానిక ట్రిపుల్ ఐటీలో స్థానిక ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఆదివారం మహిళా మిత్రలకు, విద్యార్థులకు పోలీసు చట్టాలపై అవగాహన కల్పించారు. ముఖ్యఅతిధిగా పాల్గొన్న అడిషనల్ ఎస్పీ సత్తిబాబు మాట్లాడుతూ ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దిశ చట్టంపై ప్రతి ఒక్కరిలో అవగాహన కలగాలని చెప్పారు. అదేవిధంగా అందరికీ అవగాహన కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. దిశ సంఘటన తెలంగాణ రాష్ట్రంలో జరిగితే ముందస్తుగా ఎటువంటి సంఘటనలు జరుగకుండా దిశ చట్టాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి అమలు చేస్తున్నారని, మహిళల కోసం ప్రత్యేకమైన చట్టాలు ఏ రాష్ట్రంలో కూడా లేవని చెప్పారు. రాష్ట్రంలో అమలు అవుతున్న దిశ చట్టంపై అధ్యయనం చేసేందుకు మహారాష్ట్ర హోంమంత్రితో పాటు పలువురు అధికారులు కూడా వచ్చారని, ఇది మన రాష్ట్రానికి గర్వకారణమని తెలిపారు. ఆపదలో ఉన్న మహిళలను అన్ని విధాలుగా ఆదుకుంటామని, నూతనంగా ఆవిష్కరించిన యాప్‌కు ఎంతో మంది ఉపయోగిస్తున్నారని చెప్పారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న దిశ పోలీసు స్టేషన్లు ఎంతో మోడల్‌గా ఏర్పాటు చేస్తున్నారని, ఒకపోలీసు స్టేషన్‌కు వెళ్తున్నామనే భావన కలుగకుండా ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల రక్షణ కోసం ఉన్న చట్టాలను ఉపయోగించుకునే ధైర్యం కావాలని, లేకుండా చట్టాల వల్ల ఉపయోగం ఏమాత్రం ఉండదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎంత విద్యావంతులైనప్పటీ వాస్తవాలు చెబితేనే న్యాయం జరుగుతుందని అన్నారు. సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి కృష్ణకాంత్ పటేల్, నూజివీడు డిఎస్‌పి బి శ్రీనివాసులు, సిఐ రామచంద్రరావు, ఎస్‌ఐలు శ్రీనివాసరావు, రంజిత్‌కుమార్, విజయవాడ వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు కీర్తితో పాటు ట్రిపుల్ ఐటీ అధికారులు పాల్గొన్నారు.