కృష్ణ

కరోనాపై ఆందోళన, భయం వీడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ: కరోనా వైరస్ పట్ల భయం, ఆందోళనలు వీడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలను, జాగ్రత్తలను పాటించాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు సూచించారు. నందిగామ నగర పంచాయతీ పరిధిలోని ప్రధాన వీధుల్లో పర్యటిస్తూ రైతు బజారు, దేవాలయాలు, ఆర్టీసి బస్టాండ్, హోటళ్లు, గాంధీ సెంటర్, రథం సెంటర్‌లతో పాటు పలు ప్రధాన కూడల్లో జనసమూహం అధికంగా ఉన్న ప్రాంతాల్లో శనివారం ఆయన కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. తెల్లవారుజాము నుండి అయిదు గంటల నుండే రోడ్లపై తిరుగుతూ కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. తెల్లవారుజాము ఐదు గంటల నుండే రోడ్లపై తిరుగుతూ ప్రజలకు కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జగన్మోహనరావు మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణలో ప్రజల సహకారంతో పాటు భాగస్వామ్యం అవసరమని తెలిపారు. కరోనా వైరస్ పట్ల ప్రజల్లో నెలకొన్న అపోహాలు, భయాలను పోగొట్టేలా అధికారులు అవగాహన కల్గించి ప్రజలను చైతన్యవంతం చేయాలని జగన్మోహనరావు పేర్కొన్నారు. నగర పంచాయతీ పరిధితో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులకు సూచించారు. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోది పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ విధిగా జనతా కర్ప్యూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ మల్లేశ్వరరావు, శానిటరీ ఇన్స్‌పెక్టర్ శివారెడ్డి, పట్టణ కన్వీనర్ కత్రోజు శ్రీనివాసాచారి. నాయకులు మహమ్మద్ మస్తాన్, మండవ పిచ్చయ్య, రబ్బానీ, బండారు వెంకట్రావు, ముఖర్జీ, చల్లా బ్రహ్మేశ్వరరావు, మారం అమరయ్య, పాకాలపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.