కృష్ణ

కనులపండువగా శ్రీ మల్లేశ్వరస్వామి కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మండవల్లి: మండవల్లిలో స్వయంభూగా వేంచేసియున్న శ్రీభ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వార్ల కల్యాణం శనివారం కన్నుల పండువగా జరిగింది. ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ గుడివాడ బాలాజీరావు అధ్యక్షతన, ఆలయ కార్యనిర్వహణాధికారి శింగనపల్లి శ్రీనివాసరావు పర్యవేక్షణలో వడ్లమన్నాడుకు చెందిన బ్రహ్మశ్రీ గూడూరు వెంకట రామకృష్ణ యాజ్ఞికత్వంలో గుడివాడ నాగతిరుమల వెంకట్రామానాయుడు, గుడివాడ భోగయ్యనాయుడుల దంపతులచే స్వామివార్ల కల్యాణాన్ని వేదమంత్రోచ్ఛరణల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయంలో పండితులు గూడూరి హనుమత్‌శాస్ర్తీ, భవానీశంకర్‌శాస్ర్తీ ఉదయం, సాయం త్రం వేదమంత్రాలతో బలిహరణ, హోమం నిర్వహించారు.

అంబేద్కర్ జయంతి రోజున
నెరవేరనున్న పేదల సొంతింటి కల
* మహిళలకు మంత్రి కొడాలి నాని హామీ
గుడివాడ, మార్చి 21: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజు ఏప్రిల్ 14వ తేదీన రాష్ట్రంలోని పేదవర్గాలకు సొంతింటి కల నెరవేరనుందని, దీని లో భాగంగా 26.6లక్షల మంది నిరుపేదలకు ఇళ్ళపట్టాలను పంపిణీ చేస్తున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు. శనివారం మండల కేంద్రమైన గుడ్లవల్లేరు జేమ్స్‌పేట 1వ వార్డుకు చెందిన మహిళలు మంత్రి కొడాలి నానిని కలిశారు. ఈ సందర్భంగా మండలానికి చెందిన శీరం వెంకట సుబ్బారావు, ఎం మురళి, లింగిశెట్టి వెంకటేశ్వరరావు, కొమ్మనబోయిన రవిశంకర్, దామిశెట్టి రంగబా బు మాట్లాడుతూ ఇళ్ళపట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ మంజూరు కాలేదని, ఇటీవల ఎన్నికల ప్రచారంలో రీ వెరిఫికేషన్ కూడా చేయించాలని కోరామన్నారు. దీనిపై మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఇళ్ళపట్టాల పంపిణీకి ప్రభుత్వం రూ.14వేల కోట్లను కేటాయించిందని చెప్పారు. దీనిలో భాగంగా 43వేల 141ఎకరాల భూమిని ఇళ్ళపట్టాల పంపిణీకి సిద్ధం చేశామన్నారు. 2008 లోనే దివంగత రాజశేఖరరెడ్డి 107ఎకరాల భూమిని ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయించి ఇచ్చారన్నారు. ఆ తర్వాత సీఎం జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే 110ఎకరాల భూమిని కొనుగోలు చేశారన్నారు. సొంతిల్లు లేని నిరుపేద ఉండకూడదన్న ఉద్దేశ్యంతో సీఎం జగన్ ఎంత మందికి అర్హత ఉన్నా ఇళ్ళపట్టాలు ఇవ్వాల్సిందేనని ఆదేశించారని చెప్పా రు. దీనిలో భాగంగానే గుడివాడ నియోజకవర్గంలో పేదలకు అవసరమైన భూమిని సిద్ధం చేశామని, ఇళ్ళపట్టాలు మంజూరు కాని లబ్ధిదారులు ఆందోళన చెందవద్దని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ళపట్టాలను అందించే బాధ్యత తాను తీసుకుంటానని మంత్రి కొడాలి నాని చెప్పారు. మాజీ కౌన్సిలర్ పొట్లూరి వెంకట కృష్ణారావు పాల్గొన్నారు.