కృష్ణ

జనతా కర్ఫ్యూలో అన్ని వర్గాలూ భాగస్వాములు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: కరోనా పట్ల ఆందోళన అవసరం లేదని అప్రమత్తంగా ఉంటే చాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పిలుపు మేరకు ఆదివారం ఉదయం 7గంటల నుండి రాత్రి 9గంటల వరకు నిర్వహించే జనతా కర్ఫ్యూలో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని శనివారం ఒక ప్రకటనలో కోరారు. ప్రజల స్వచ్చంద భాగస్వామ్యంతోనే జనతా కర్ఫ్యూని విజయవంతం చేయటంతో పాటు కరోనా వైరస్‌ను నివారించవచ్చన్నారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ప్రజలంతా నిత్యావసర వస్తువులను ఒక రోజు ముందుగానే తెచ్చుకోవాలన్నారు. ఆదివారం ఉదయం నుండి రాత్రి వరకు ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ కోసం వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. అత్యవసర సేవల కోసం పోలీసులు అన్ని వేళలా సిద్ధంగా ఉంటారన్నారు. కర్ఫ్యూ జరుగుతున్న 14 గంటల పాటు పోలీసులు తమ తమ పోలీసు స్టేషన్లలోనే ఉండి ప్రజలకు ఎటువంటి అత్యవసర సేవలు అవసరమైనా వెంటనే స్పందించాలని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సూచించారు.

తిరుపతమ్మ ఆలయం మూసివేత
పెనుగంచిప్రోలు, మార్చి 21: దేవాదాయ శాఖ ఉన్నతాదికారుల ఆదేశాల స్థానిక శ్రీగోపయ్య సమేత శ్రీతిరుపతమ్మ అమ్మవారి ఆలయాన్ని శనివారం నుండి మూసివేశారు. అయితే ఆలయంలో లోక కల్యాణార్థం, కరోనా వ్యాధి నియంత్రణ కోరతూ ఆలయ కార్యనిర్వహణ అధికారిణి శోభారాణి పర్యవేక్షణలో హోమాలు, ప్రత్యేక పారాయణలు నిర్వహించారు. వేదపండితులు కిరణ్ శర్మ, గోపాలకృష్ణ శర్మ, ఆలయ అర్చకుడు మర్రెబోయిన రమణ ఆధ్వర్యంలో ఈ హోమ కార్యక్రమాలను నిర్వహించారు.

ఆలయాలు, సినిమా థియేటర్ల మూసివేత
నందిగామ, మార్చి 21: కరోనా వైరస్ నిరోధక చర్యలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సినిమా హాళ్లు, ఆలయాలు మూసివేశారు. నందిగామలోని శుకశ్యామలాంబ సమేత రామలింగేశ్వరస్వామి, అంబారుపేట సత్యమ్మ అమ్మవారి ఆలయం, మరిడి మహాలక్ష్మీ తదితర ఆలయాలను శనివారం నుండి మూసివేశారు. భక్తులు మొక్కుబడులను వాయిదా వేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అదే విధంగా పట్టణంలోని లక్ష్మీప్రసన్న, విజయ, మయూరి సినిమా ధియేటర్‌లను మూసివేశారు.

పారిశుద్ధ్యంపై ఇంత నిర్లక్ష్యమా?
నూజివీడు, మార్చి 21: ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే వెంటనే స స్పెండ్ చేస్తామని నూజివీడు సబ్ కలెక్టర్, నూజివీడు పురపాలక సంఘం ప్రత్యేక అధికారి స్వప్నిల్ దినకర్ పుం డ్కర్ హెచ్చరించారు. శనివారం నూజివీడు పురపాలక సంఘం పరిధిలోని పలు వార్డులలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. ఫిష్ మార్కెట్ ను పరిశీలిస్తున్న సమయంలో అక్కడ నెలకొని ఉన్న పారిశుద్ద్యంను చూసి ఖంగుతిన్నారు. భారీగా దుర్వాసన రావటంతో ముక్కు మూసుకుని సదరు ప్రాంతా న్ని పరిశీలించారు. పారిశుద్ద్యం ఇంత దారుణంగా ఉంటే ఏం చేస్తున్నారం టూ శానిటరీ ఇనస్పెక్టర్ నాగేంద్రరావు పై ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారు లు పర్యటిస్తున్నామని తెలిసి కూడా పా రిశుద్ద్యంను పట్టించుకోరా..? అంటూ ప్రశ్నించారు. అధ్వాన్నంగా ఉన్న పారిశుద్ద్యం వల్ల అంటు రోగాలు వచ్చే అవకాశం ఉందని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడతారని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలను ఏవిధంగా కాపాడతారంటూ అధికారులను ఆయన నిలదీశారు. నిర్లక్ష్యంగా వ్యవహారించిన సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. తరచూ పురపాలక సంఘం పరిధిలోని పలు ప్రాంతాలను తనిఖీ చేస్తానని ఇటువంటి పరిస్థితులు కనిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశుద్ద్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సబ్ కలెక్టర్ వెంట పురపాలక సంఘం కమీషనర్ వాసుబాబు తదితరులు పాల్గొన్నారు.